Magadheera | Cinema | Allu Aravind | Ramcharan | | ఈనెల 18 నుంచి "మగధీర" చిత్రానికి అదనపు ఆకర్షణ
File
FILEగీతా ఆర్ట్స్ సంస్థ త్వరలో ఈ చిత్రంలో ఉత్కంఠభరితమైన సన్నివేశాన్ని జోడించబోతున్నట్టు ఆయన చెప్పారు. చిరంజీవి తనయుడు రామ్‌చరణ్, కాజల్, శ్రీహరి, రావురమేష్‌లపై దర్శకుడు రాజమౌళి ఎంతో కష్టపడి చిత్రీకరించిన ఓ చూడముచ్చటైన యాక్షన్ సన్నివేశాన్ని జతచేస్తామని తెలిపారు.
ఈ చిత్రం తెలుగు చలన చిత్ర చరిత్రలోనే ఆల్‌టైం రికార్డ్‌గా అత్యధిక సెంటర్స్‌లో అర్థ శతదినోత్సవం జరుపుకోబోతున్న శుభసమయంలో ప్రేక్షకులకు అందిస్తున్న కానుక ఇది అని అరవింద్ అన్నారు.
చిత్ర నిడివిని తగ్గించే క్రమంలో తొలుత ఈ సన్నివేశాన్ని తొలగించామన్నారు. అయితే, చిత్రం విడుదలైన తర్వాత వస్తున్న అపూర్వ స్పందన నేపథ్యంలో ఈ నెల 18వ తేదీ నుంచి ఈ సన్నివేశాన్ని జత చేయనున్నట్టు నిర్మాత తెలిపారు.