Kamalhasan | Eenadu Cinema | Audio Release | Venkatesh | మా కుటుంబానికి సినిమా ఊపిరిలాంటిది: కమల్
WD
WDఈ సందర్భంగా చిత్ర హీరో కమల్ హాసన్ మాట్లాడుతూ.. వెంకి (వెంకటేష్)తో పని చేయడం చాలా హ్యాపీగా ఉందన్నారు. స్టార్ అనేది ప్రేక్షకులు ఇచ్చిన వరం. మనిషిగా ఉండటం దేవుడిచ్చిన వరం. తనలోని టాలెంట్‌ని చూసి శ్రుతికి సంగీతంలో అవకాశం ఇచ్చాను. నాకు తెలిసిందంతా సినిమా వ్యాపారమే. అందుకే నా కుటుంబమంతా ఈ రంగంలోకి ప్రవేశించారు. 'ఈనాడు' చిత్రం పూర్తిస్థాయి కమర్షియల్ చిత్రం అని చెప్పారు.
అనంతరం మరో హీరో వెంకటేష్ మాట్లాడుతూ.. ఈనెల 18వ తేదీన చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు చెప్పారు. శ్రుతి మంచి సంగీతాన్ని అందించారన్నారు. నేపథ్య సంగీతానికి అవకాశమున్న సినిమా ఇది. నాకు కూడా చిత్రాన్ని ఎపుడు చూస్తానా అని ఆతృతగా ఉందన్నారు.
ఆ తర్వాత కమల్ సతీమణి గౌతమి మాట్లాడుతూ.. నా కుటుంబానికి ఇది అత్యంత ముఖ్యమైన కార్యక్రమం. చిత్రానికి శ్రుతి సంగీతం అందిస్తే.. ప్రచారం కోసం అక్షర హాసన్ నృత్య దర్శకత్వం వహించిందన్నారు. నేను డబ్బింగ్ విభాగంలో పని చేశాను అని వివరించారు.
కథా రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. కమల్ నటీ నటులకు ఒక డిక్షనరీలాంటి వ్యక్తి అని కొనియాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో అచ్చిరెడ్డి, నీలకంఠ, కోదండరామిరెడ్డి, ఆదిత్య దయానంద్, చదలవాడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.