Telugu film | Talkie film | 78 years | September 15 | C. Pullaiah | తెలుగు సినిమా మాటలు నేర్చి 78 ఏళ్లు
WD
తొలి భారతీయ టాకీ చిత్రం ఆలమ్ ఆరా నిర్మించబడిన 1931లోనే తొలి తెలుగు టాకీ చిత్రం కూడా నిర్మించబడింది. హెచ్ఎం రెడ్డి బొంబాయిలో 1931లో భక్త ప్రహ్లాద నిర్మించాడు. సురభి కమలాభాయి తొలి తెలుగు కథానాయికగా నిలిచిపోయింది.
మార్చి 14న తొలి భారతీయ చిత్రం విడుదలైతే, సెప్టెంబరు 15న అదే చిత్రం తెలుగులో తొలిసారిగా 1931లో విడుదలైంది. ఆ రెండు చిత్రాలకు ఉన్న వ్యత్యాసం ఆరు నెలలు మాత్రమే. ఇదిలా ఉండగా ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు ఇండస్ట్రీ మంగళవారం గుర్తుగా చలనచిత్ర జెండాను ఆవిష్కరించనున్నది.