YS Rajasekhara Reddy | Cinema | Puri Jagannath | Actor Raja sekhar | Jeevita | పూరి జగన్నాథ్ దర్శకత్వంలో "రాజశేఖర రెడ్డి"
FILE
"గాంధీ" సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో అదే స్థాయిలో "రాజశేఖరరెడ్డి" చిత్రం చిత్రీకరణ ఉంటుందన్నారు. అలాగే రాజశేరరెడ్డి చిత్రంలో ప్రతినాయకులు కూడా ఉంటారట. మరి ఆ పాత్రలు ఎవరివనేవి ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే ఈ పాత్రలు రాజశేఖరరెడ్డి రాజకీయ జీవితంలో ఎదురపడ్డ ప్రత్యర్థులువై ఉంటాయనీ, వాటినే తెరపైకి ఎక్కిస్తామని పూరి చెప్పారు. విపక్ష నేత అయిన చంద్రబాబు నాయుడు పాత్ర కూడా ఉంటుందని సమాచారం.
ఇంకా ఈ సమావేశంలో జీవితా, రాజశేఖర్లు మాట్లాడుతూ.. అంతకు ముందు "లోకనాయకుడు" అనే పేరుతో చిత్రాన్ని చేద్దామనుకున్నామనీ, అయితే వెఎస్సార్ అందరికీ రాజశేఖరరెడ్డిగా తెలుసు కనుక అదే పేరుతో చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు.
రాజశేఖరరెడ్డి చిత్రాన్ని తీస్తున్నట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలుపగా ఆయన ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారని పూరి జగన్నాథ్ చెప్పారు. ఈ చిత్రాన్ని చాలా ఉన్నతంగా తీర్చిదిద్దాలని జగన్ తనతో చెప్పారన్నారు. అందుకోసం తాము వైఎస్సార్ జీవితంపై మూడు నెలలపాటు అధ్యయనం చేయదలచామన్నారు.
ఇదిలావుండగా రాజశేఖరరెడ్డి చిత్రం నిర్మిస్తున్నట్లు వార్త బయటకు రాగానే వైఎస్సార్ అభిమానుల నుంచి ఫోన్ కాల్స్ వెల్లువెత్తుతున్నాయని పూరీ జగన్నాథ్ చెప్పారు.