1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Book Release

Vendi Vennela| Book Release| Dasari Narayana Rao| Vinayak Rao | దాసరి చేతులమీదుగా "వెండివెన్నెల" పుస్తకావిష్కరణ

వెండివెన్నెల
WD
తెలుగుసినిమా టాకీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారంనాడు సీనియర్ పాత్రికేయుడు వినాయకరావు రచించిన "వెండివెన్నెల" పుస్తకాన్ని లాంఛనంగా ఆవిష్కరించారు. టాకీ తొలిచిత్రంలో నటించిన ఎల్.వి.ప్రసాద్‌కు చెందిన ప్రసాద్‌ల్యాబ్స్‌లో ఈ వేడుక జరగడం విశేషం.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డా. దాసరి నారాయణరావు చేతులమీదుగా పుస్తకావిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ.. మన దేశంలో సినిమా జర్నలిజంలో ఆరోగ్యవంతమైనది.. తెలుగురంగమేనని చెప్పారు. జర్నలిస్టుగా రజతోత్సవంనాడు వినాయకరావు ఈ పుస్తకాన్ని అందించడం ఆనందించదగినదని దాసరి తెలిపారు.

ఈ పుస్తకంలో ఆసక్తికర అంశాలు చాలా ఉన్నాయని, మళ్లీమళ్లీ తీసిన సినిమాల గురించి రావడం ఇప్పటి నిర్మాతలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని దాసరి అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే అందరూ ఈ పుస్తకాన్ని చదవాలని ఆయన తెలిపారు.

పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. ప్రస్తుతం చరిత్రను రాసేవారు దొరకడంలేదు. చరిత్ర రాయాలంటే ఎన్నో కష్టాలు పడాలి. అవి తాను కథ, కథనం, శిల్పం రాసినప్పుడు అనుభవించానని, ఈ పుస్తకం భావితరాలకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని పరుచూరి వెల్లడించారు.

డి.వి.ఎస్. రాజు మాట్లాడుతూ.. చలనచిత్రరంగానికి సంబంధించిన చరిత్ర పుస్తకాలకు సరైన ఆదరణలేదన్నారు. గతంలో నిర్మాతల మండలి.. ఎంతో కష్టపడి తయారుచేసిన తెలుగు నిర్మాతల చరిత్ర పుస్తకం ఇప్పటికీ అమ్మకాలు పెద్దగా జరగలేదు. ఇలాంటివి చదవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజు చెప్పారు.
About Writer
SELVI.M