Bendu Apparao| Audio| Naresh| Kamna Jetmalani| Rama Naidu| E.V.V | "బెండు అప్పారావు" ఆడియో విడుదల
WD
హీరో విక్టరీ వెంకటేష్ ఆడియోను విడుదలచేసి రామానాయుడు మనుమడు అభిరామ్‌కు తొలికేసెట్‌ను అందజేశారు. సీడీని రామానాయుడు ఆవిష్కరించి సంగీతదర్శకుడు కోటికి అందించారు.
ఈ సందర్భంగా విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. టైటిల్ వినగానే క్యాచీగా ఉంది. ఎంటర్‌టైన్ చిత్రాలు తీయడంలో ఇ.వి.వి అందెవేసిన చేయి. చక్కటి కామెడీని నరేష్ పండించాడని కితాబిచ్చారు.
కోటి మాట్లాడుతూ.. ఇందులోని పాటలు చాలా వైవిధ్యంగా ఉంటాయన్నారు. పరిశ్రమకు పెద్ద దిక్కులాంటివారు రామానాయుడు తీస్తున్న ఈ సినిమా ప్రస్తుతం రీరికార్డింగ్ కార్యక్రమాలను జరుపుకుంటోందని చెప్పారు. పూర్తి వినోదాత్మకంగా రూపొందించిన ఈ చిత్రంలో నాలుగు పాటలు మాత్రమే ఉన్నాయని కోటి వెల్లడించారు.
ఇ.వి.వి. సత్యనారాయణ మాట్లాడుతూ.. "నాకు, నా కుమారులకు మంచి బ్రేక్ ఇచ్చింది రామానాయుడేనని, వారి పతాకం అంటే చాలా ఇష్టమన్నారు. ఈ చిత్రంలో పల్లెటూర్లో మనకు తారసపడే అనేకానేక పాత్రలు కన్పిస్తాయి. ఆర్.ఎం.పి. డాక్టర్ చేసే చిలిపిపనులు ఈ సినిమాలో వినోదాత్మకంగా ఉంటాయి. నేను 49 సినిమాలకు దర్శకత్వం వహిస్తే, అందులో పాతిక సినిమాలకు కోటి సంగీతం అందించారు. బెండు అప్పారావు సినిమాలోని మూడు పాటలను ఇటలీ. ఆస్ట్రియా, జర్మనీ, ఆమ్‌స్టర్‌డామ్‌లో చిత్రించామని" ఇ.వి.వి. తెలిపారు.
ఇంకా ఈ కార్యక్రమంలో కామ్నజఠ్మలాని, గీతరచయిత రామజోగయ్యశాస్త్రి, ఉత్తేజ్, అలీ తదితరులు పాల్గొన్నారు.