1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Glamour

Karishma Kotak| Glamour| Models| Catwalk| Shankar dada zindabad | కరిష్మా కొటక్ ప్రధాన పాత్రలో "గ్లామర్"

కరిష్మా కొటక్
WD
కరిష్మా కొటక్ ప్రధాన పాత్రలో పి. సత్యారెడ్డి నిర్మాణదర్శకత్వంలో రూపొందుతోన్న "గ్లామర్" చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ నెల 10 నుంచి 25వరకు ముంబై పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తున్నామని సత్యారెడ్డి చెప్పారు.

ఈ సందర్భంగా సెక్సీడాళ్ కరిష్మా కొటక్ మాట్లాడుతూ.. శంకర్‌దాదా జిందాబాద్ తర్వాత అన్నీ అటువంటి పాత్రలే రావడంతో కథలు నచ్చలేక చేయలేదని చెప్పింది. "గ్లామర్" చిత్రంలోని పాత్ర నచ్చి నటించేందుకు అంగీకరించానని, ఇది యూత్‌ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు తీర్చిదిద్దుతున్నారని ఆమె వెల్లడించింది.

చిత్ర సమర్పకుడు ఎస్.కె. రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం జరిగే షెడ్యూల్తో షూటింగ్ పూర్తవుతుందన్నారు. పది దేశాలకు చెందిన ప్రముఖ మోడల్స్ ఈ చిత్రంలో క్యాట్‌వాక్ చేస్తారని తెలిపారు.

ఇంకా ఈ చిత్రంలో బాంబేరవి, రామిరెడ్డి, కొండవలస, రాఘవ తదితరలు నటించారు. కెమెరా: శ్రీనివాస్, ఆర్ట్: రామకృష్ణ, ఎడిటింగ్: శ్రీనివాస్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం: పి. సత్యారెడ్డి.
About Writer
SELVI.M