Villagelo Vinayakudu, Audio, Krishnudu, Happy Days, Vinayakudu | "విలేజ్లో వినాయకుడు" ఆడియో విడుదల
WD
ఈ చిత్రానికి మహి నిర్మాత. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ మంగళవారం రాత్రి కూకట్‌పల్లిలోని కళామందిర్‌లో జరిగింది. యండమూరి ఆడియో కేసెట్‌ను విడుదల చేశారు.
ఆడియో వేడుకలో యండమూరి మాట్లాడుతూ.. తెలుగులో కొత్త సినిమాలు, కొత్త కథలు, టేకింగ్ అని చెప్పను. ఇది రొటీన్ సినిమానే. అయితే దర్శకుడు తీసిన విధానం బాగుంది. అందరూ హ్యాపీగా ఉండేట్లు ఈ చిత్రముంటుంది. ఇందులో తాను కీలక పాత్ర పోషించానని అన్నారు. ఇందులో తాను ముఖ్యపాత్ర పోషించానని, చాలా చిత్రాలు వస్తున్నా కథ నచ్చక చేయలేదని, ఇది నచ్చి అంగీకరించానని చెప్పారు.
కృష్ణుడు మాట్లాడుతూ.. వినాయకుడులో మంచి నీతి ఉంది. అదేవిధంగా "విలేజ్‌లో వినాయకుడు" చిత్రాన్ని కూడా చక్కని సందేశంతో దర్శకుడు ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారని చెప్పారు. చందమామలాంటి చక్కని ప్రేమకథా చిత్రమిదని తెలిపారు.
సంగీత దర్శకుడు మణికాంత్ మాట్లాడుతూ.. పాటలు వనమాలి అందించారు. అందుకు అనుగుణంగా ట్యూన్స్ సమకూర్చానని చెప్పారు. మంచి ఆడియో అవుతుందని మణికాంత్ నమ్మకం వ్యక్తం చేశారు.
వనమాలి మాట్లాడుతూ.. ఇందులోని ప్రతిపాటా కథను నడిపేవిధంగా ఉంటుందన్నారు. అన్ని మెలోడి పాటలేనని, రెండే యూత్‌ను ఉద్దేశించి రాసినవి తెలిపారు. మణికాంత్‌కు మంచి భవిష్యత్ ఉందని వనమాలి పేర్కొన్నారు. ఈ ఆడియో మధుర ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా పదిరూపాయలకే మార్కెట్లో లభిస్తుందని, ఆడియో కొనుగోలుచేసిన వారికి రిలయెన్స్ సిమ్‌కార్డ్ కానుకగా అందిస్తున్నారని వనమాలి తెలియజేశారు.