1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Dinesh Lal Yadav

Tadaka Movie, Bhojpuri Super star| Dinesh Lal Yadav| Sunayana Hegde| Roopa Kaur | భోజ్‌పురి సూపర్ స్టార్ తన "తడాఖా" ఏంటో చూపిస్తారా..?

భోజ్పురి సూపర్ స్టార్ దినేష్ లాల్
WD
భోజ్‌పురి సూపర్‌స్టార్ దినేష్‌లాల్ యాదవ్ తొలిసారిగా తెలుగులో నటిస్తోన్న చిత్రం "తడాఖా". రాహుల్ మూవీ మేకర్స్ పతాకంపై బి.ఓ. సుబ్బారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూసల రాధా దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో సునయన హెగ్డే, రూపాకౌర్ కథానాయికలుగా నటిస్తున్నారు.

ఇటీవలే తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి నిర్మాత సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. తమ బేనర్‌పై నిర్మిస్తోన్న రెండో చిత్రమిదన్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగి తొలి షెడ్యూల్‌లో నాలుగు పాటలు, కొంత టాకీపార్ట్, యాక్షన్ సీక్వెన్స్‌లను పూర్తి చేశామని తెలిపారు. దీంతో 80 శాతం షూటింగ్ పూర్తయిందని, ఇంకా రెండు పాటలను, పతాక సన్నివేశాలను ఈ నెల 29నుంచి హైదరాబాద్‌లో ప్రారంభమయ్యే తదుపరి షెడ్యూల్‌లో పూర్తి చేస్తామని నిర్మాత వెల్లడించారు.

దర్శకుడు పూసల రాధా మాట్లాడుతూ.. యాక్షన్ ఓరియెంటెడ్‌‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కథానాయకుడు దినేష్ విభిన్నమైన షేడ్స్‌లో కనిపిస్తారు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌ను జోడించి ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు దర్శకుడు చెప్పారు. తప్పకుండా తమ "తడాఖా" అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆయన ఆశించారు.

జీవీ, గుండు హనుమంతరావు, చిట్టిరెడ్డి, అను వైష్ణవి, మధుమిత తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: రాజేష్-రజనీష్, మాటలు: పూసల, కెమెరా: మోహన్‌చంద్, ఫైట్స్: మార్షల్ రమణ, కళ: కె.వి. రమణ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎం. కిషోర్ కుమార్, సమర్పణ: మాస్టర్ ప్రీతమ్ రెడ్డి.
About Writer
SELVI.M