1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Cinema

Ek Niranjan| Cinema| Prabhas| Kangana Ranaut| Audio, Puri Jagannath| Mani Sharma | 25న ప్రభాస్ "ఏక్‌‌నిరంజన్" ఆడియో విడుదల

ఏక్నిరంజన్
WD
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా, డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న భారీ చిత్రం "ఏక్‌నిరంజన్". ఆదిత్యారామ్ మూవీస్ పతాకంపై ఆదిత్యారామ్ గ్రూఫ్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ ఆదిత్యరామ్ నిర్మిస్తోన్న ఈ చిత్రం షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా నిర్మాత ఆదిత్యారామ్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 25న 'ఏక్‌నిరంజన్' ఆడియోను ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేస్తున్నామన్నారు. మణిశర్మ అందించిన సంగీతం చిత్రానికి హైలైట్ అవుతుందని నిర్మాత చెప్పారు. ఇందులోని అన్ని పాటలు సూపర్ హిట్ అవుతాయని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.

పూరి జగన్నాథ్, మణిశర్మల కాంబినేషన్‌లో 'ఏక్‌నిరంజన్' మరో మ్యూజికల్ హిట్ అవుతుందని, ప్రభాస్ కెరీర్‌లో ఓ సెన్సేషనల్ ఫిలిమ్‌గా నిలిచిపోతుందని నిర్మాత అన్నారు. ఇంకా ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ అంశాలను మేళవించాం. నవరసభరితంగా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా దర్శకులు పూరి జగన్నాథ్ అద్భుతంగా తెరకెక్కించారని నిర్మాత ప్రశంసించారు.

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ 'ఏక్‌నిరంజన్' ద్వారా తొలిసారిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతోందని ఆదిత్యారామ్ వెల్లడించారు. 35 రోజులతో పాటు థాయ్‌లాండ్‌లో తీసిన యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ చిత్రాల స్థాయిలో ఉంటాయన్నారు. అక్టోబర్ 29న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత తెలియజేశారు.
About Writer
SELVI.M