Jaye Bhava| Cinema| Kalyan Ram| Hansika| DesaMuduru| Hare Ram| Athanokkade | "జయీభవ" అంటోన్న కళ్యాణ్‌రామ్, హన్సిక!
WD
అతనొక్కడే, హరేరామ్ వంటి హిట్ చిత్రాల తర్వాత ఎన్టీఆర్ బేనర్‌లో వస్తోన్న ఈ హ్యాట్రిక్ ఫిలిమ్‌లో కళ్యాణ్‌రామ్ సరసన 'దేశముదురు' కథానాయిక హన్సిక కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం ద్వారానే నరేన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ఈ చిత్రం గురించి హీరో, నిర్మాత నందమూరి కళ్యాణ్‌రామ్ మాట్లాడుతూ.. ఇందులో ఒక డిఫరెంట్ రోల్ చేస్తున్నాను. అత్యున్నత సాంకేతిక విలువలతో ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామన్నారు. దాదాపు షూటింగ్ పూర్తయిందని, సినిమా చాలా బాగా వచ్చిందని కళ్యాణ్‌రామ్ తెలిపారు.
అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో రూపొందుతోన్న ఈ చిత్రం తప్పకుండా ఘనవిజయం సాధిస్తుందని నిర్మాత నమ్మకం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెలాఖరులో ఆడియోను రిలీజ్ చేసి, అక్టోబర్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని హీరో కళ్యాణ్ రామ్ తెలిపారు.
నందమూరి కళ్యాణ్‌రామ్, హన్సిక, ముఖేష్ రుషి, ఆశిష్ విద్యార్థి, జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మానందం, అలీ, రఘుబాబు, వేణుమాధవ్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి కథ-మాటలు: బి.వి.ఎస్. రవి, సంగీతం: థమన్ ఎస్., ఫోటోగ్రఫీ: దాశరథి శివేంద్ర, ఫైట్స్: విజయ్, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: రాజీవ్ నాయర్. సమర్పణ: మాస్టర్ నందమూరి శౌర్యారామ్, నిర్మాత: నందమూరి కళ్యాణ్‌రామ్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నరేన్.