1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Thushar Gandhi

Mahatama Cinema Audio| Thushar Gandhi| Srikanth| KrishnaVamsi| Allu Arjun| Mohan Babu | తుషార్‌గాంధీ చేతులమీదుగా "మహాత్మా" ఆడియో

మహాత్మా సినిమా ఆడియో
WD
జాతిపిత మహాత్మాగాంధీ మనుమడు తుషార్‌గాంధీ "మహాత్మా" చిత్ర ఆడియోసీడీని విడుదల చేశారు. సోమవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ఈ ఆడియో విడుదల కార్యక్రమానికి తుషార్‌గాంధీ ముఖ్యఅతిథిగా విచ్చేశారు.

"మహాత్మా" ఆడియోను ఆవిష్కరించిన సందర్భంగా తుషార్‌గాంధీ మాట్లాడుతూ.. ఈ సినిమా కథను విన్నానని, ఈ సినిమా ద్వారా బాపు సందేశాన్ని ప్రజల హృదయాలకు చేరవేస్తున్నామని దర్శకుడు కృష్ణవంశీ వెల్లడించినట్లు పేర్కొన్నారు.

చిత్ర హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. తనకు నటుడిగా అవకాశమిచ్చిన రామోజీరావు కృతజ్ఞతలు తెలియజేస్తూ.. హీరోగా పరిచయం చేసిన తమ్మారెడ్డి భరద్వాజకు, హిట్ సినిమా తీసిన రామానాయుడు, ఎస్.వి.కృష్ణారెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నారు. చిత్ర నిర్మాత రావు ఖర్చుకు ఎక్కడా రాజీపడకుండా సినిమా తీస్తున్నారని, కృష్ణవంశీ అద్భుతంగా తెరకెక్కించారని శ్రీకాంత్ వెల్లడించారు.

బ్రహ్మానందం మాట్లాడుతూ.. కృష్ణవంశీ ఎలాంటి పాత్రకు ఎలాంటి నటుడు కావాలో సరిగ్గా ఎంచుకుంటారు. శ్రీకాంత్ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ చిత్రం తప్పకుండా ఘనవిజయం సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమానికి హాజరైన యంగ్ హీరో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. తనలో అంతో ఇంతో దేశభక్తి పెరిగింది అంటే అది కృష్ణవంశీ సినిమాల ప్రభావం వల్లేనన్నారు. సినిమా హీరోల్లా అన్నయ్యా అని అప్యాయంగా పిలిచేది శ్రీకాంత్‌నేనని, అటువంటి వ్యక్తి నటిస్తోన్న ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని ఆశించారు.

మోహన్‌బాబు మాట్లాడుతూ.. శ్రీకాంత్‌తో కలిసి "తప్పుచేసి పప్పుకూడు"లో నటించాను. అతను నటించిన వందో చిత్రం "మహాత్మా" ఆడియోలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో విక్టరీ వెంకటేష్, సీతారామశాస్త్రి, నాగబాబు, రవితేజ, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.
About Writer
SELVI.M