1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Sinus condition

Asin| Sinus condition| Mumbai| London Dreams| Gajini Dhirubhai Ambani Hospital | సైనస్‌తో ఆస్పత్రి పాలైన గజినీ భామ "అసిన్"!

అసిన్
IFM
"గజినీ" భామ అసిన్ సైనస్‌తో ఆస్పత్రిలో చేరింది. ముంబైలోని ధీరూబాయ్ అంబానీ ఆసుపత్రిలో రెండు రోజుల పాటు అసిన్ చికిత్స పొందుతున్నట్లు ఆమె తండ్రి చెప్పారు.

సైనస్ కారణంగా సోమవారం పూట ఆస్పత్రిలో చేరిన అసిన్‌‌కు ఎలాంటి ప్రమాదం లేదని, ఆమె మెల్లమెల్లగా కోలుకుంటుందని ఆయన అన్నారు.

అసిన్ ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సైనస్ పరిస్థితి సరిగాలేకే ఆస్పత్రిలో చేరినట్లు ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. సైనస్ పరిస్థితి గురించి ఆమె గత కొంతకాలంగా నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది.

అయితే ఇప్పుడు కచ్చితంగా ఆస్పత్రికి వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైందని చెప్పారు. ఆమె విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆమె ఇప్పుడు కూడా చెలాకీగానే ఉందని సన్నిహితులు పేర్కొన్నారు.

లండన్ డ్రీమ్స్ చిత్రం కోసం రాత్రి వేళల్లో షూటింగ్‌లో పాల్గొనడంతో సైనస్ సమస్య తీవ్రమైందని తెలిపారు. ప్రత్యామ్నాయం లేకపోవడంతో అసిన్ ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. ఈ సైనస్‌తో విశ్రాంతి కోసం ఎదురుచూస్తూ అసిన్ రంజాన్ వరకు వేచిచూసిందని సన్నిహితులు తెలిపారు.
About Writer
SELVI.M