1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Rutika

Sorry Ma Ayana Intlo vunnadu | Rutika | Hot actress | "సారీ! మా ఆయన ఇంట్లో ఉన్నాడు" టైటిల్ అర్థం ఏమిటి..?

సారీ మా ఆయన ఇంట్లో ఉన్నాడు
WD
జ్యోతి ఫిలిమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై "సారీ! మా ఆయన ఇంట్లో ఉన్నాడు" అనే చిత్రం ప్రారంభమైంది. రుతిక, భార్గవ్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని శంకర్ నిర్మిస్తున్నారు. హరీష్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ... "ఓ మధ్యతరగతి అమ్మాయి కలలు ఎలా ఉంటాయనేది ఈ చిత్రంలో చూపిస్తున్నాం. ఆ అమ్మాయి కలలు నిజం చేసుకోవాలంటే ఏం చేసిందనేది ప్రధాన అంశం. ఒకే షెడ్యూల్లో చిత్రాన్ని పూర్తి చేస్తాం" అన్నారు.

ఈ చిత్రంలో గౌతమ్ సౌమ్య, మెల్కొటి, సుమన్ శెట్టి, గుండు హనుమంతరావు, షకీలా తదితరులు నటిస్తున్నారు. కథ, స్క్రీన్ ప్లే దర్శకత్వం: హరీష్, నిర్మాత: శంకర్, సంగీతం: నరేష్, మాటలు: కె.ఆర్. ప్రసాద్, పాటలు: బాలభాస్కర్, కెమేరా: కల్యాణ్, ఎడిటింగ్: బాపు

అంతా బాగానే ఉంది.. కానీ సారీ! మా ఆయన ఇంట్లో ఉన్నాడు అన్న టైటిల్ పెడార్థాన్ని ధ్వనింపజేస్తోందని కొందరు అనుకోవడం కనిపించింది. పైకి చెప్పకపోయినా... కొంతమంది "ఏం చేస్తాం.. కలికాలం.. ముందు ముందు ఎటువంటి టైటిళ్లు వినాల్సి వస్తుందో" అని గొణుక్కోవడం కనిపించింది.

కొందరైతే.. సెటైర్లపైన సెటైర్లు విసరడం కనిపించింది. మచ్చుకు ఒకతను విసిరిన సెటరికల్ టైటిల్స్... "సారీ! మా ఆయన వస్తున్నారు.., సారీ! ఆవిడ మీ ఆవిడా...? ఇత్యాది టైటిళ్లు కూడా వచ్చేస్తాయ్ బాసూ" అంటూ ఓ కుర్ర జర్నలిస్టు నవ్వుతూ అనడం కనిపించింది.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT