1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Kajal Agarwal

Prabhas| Kajal Agarwal| Darling| Cinema| Tholi Prema| Magadheera| Switzerland| Prabhu | ప్రభాస్, కాజల్ అగర్వాల్ జంటగా కొత్త చిత్రం!

ప్రభాస్
WD
యంగ్‌రెబల్‌ స్టార్ ప్రభాస్ హీరోగా, 'తొలిప్రేమ' కరుణాకరన్ దర్శకత్వంలో 'ఛత్రపతి' ప్రసాద్ శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మిస్తోన్న భారీ చిత్రం రెండో షెడ్యూల్ స్విట్జర్లాండ్‌ జరుగుతుంది.

ఈ షెడ్యూల్ విశేషాల్ని 'ఛత్రపతి' ప్రసాద్ చెబుతూ.. సెప్టెంబర్ 28 నుంచి నెలరోజులపాటు స్విట్జర్లాండ్‌లో జరిగే షెడ్యూల్లో ప్రభాస్, కాజల్‌ అగర్వాల్‌లపై రెండు పాటల్ని, ప్రభాస్ పాల్గొనే ఓ ముఖ్యమైన ఛేజ్‌ని చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు.

అలాగే ముఖ్యతారగణం పాల్గొనే మరికొన్ని సన్నివేశాలను కూడా షూట్ చేస్తున్నామని ప్రసాద్ వెల్లడించారు. సెప్టెంబర్ షెడ్యూల్ పూర్తయ్యాక, వైజాగ్, అరకులోయల్లో ఓ భారీ షెడ్యూల్ ఉంటుందని ఆయన అన్నారు.

ప్రభాస్, 'మగధీర' కథానాయిక కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో తమిళ హీరో ప్రభు ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.

ప్రముఖ తారాగణం ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్, ఫోటోగ్రఫీ: ఆండ్రూస్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్: అశోక్, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కరుణాకరన్.

ఇకపోతే.. ఈ చిత్రానికి "డార్లింగ్" అనే పేరును ఖరారు చేయనున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి.
About Writer
SELVI.M