1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Kamal Hassan

Sruthi Hasan| Kamal Hassan| Bollywood| Lucky| Eenadu| Dasavatharam | అవన్నీ నాన్న నుంచి నేర్చుకున్నా: శృతిహాసన్

శృతిహాసన్
WD
"దశావతారం" కథానాయకుడు, పద్మభూషణ్ కమల్ హాసన్ కుమార్తె శృతిహాసన్.. తాజాగా విడుదలైన "ఈనాడు" సినిమాకు సంగీత దర్శకురాలిగా పరిచయమైన సంగతి తెలిసిందే.

బాలీవుడ్‌లో "లక్కీ" సినిమా ద్వారా హీరోయిన్‌గా తెరంగేట్రం చేసిన శృతిహాసన్.. "ఈనాడు" సక్సెస్ పట్ల సంతోషం వ్యక్తం చేసింది. సామాజాన్ని పట్టి పీడిస్తోన్న ప్రధానాంశాన్ని ఇతివృత్తంగా తీసుకుని రూపొందిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారని చెప్పింది.

ఇంకా శృతిహాసన్ తన గురించి చెబుతూ.. నటిగా తన పాత్ర గురించి ముందే బాగా తెలుసుకుంటాను. తర్వాత ఆ పాత్ర ఎలా ఉంటుందో ఊహించుకుని, దానికి తగ్గట్లుగా ఆహార నియమాలు పాటిస్తాను. ఇవన్నీ నాన్న నుంచి నేర్చుకున్నానని శృతి చెప్పింది. ఇంకా ఇంట్లో ఆరోగ్యం పట్ల అవగాహన ఎక్కువ. యోగాతో పాటు ఇతరత్రా వ్యాయామాలను చేస్తుంటామని ఆమె వెల్లడించింది.

ఇకపోతే.. తెలుగులో జయంత్ సి. పరాన్జీ కొత్త చిత్రంలో శృతిహాసన్ ఓ పాటలో పాల్గొంది. ఆ పాత్ర కూడా సందర్భానుసారంగా చేశానంటోంది. ఈ చిత్రం తెలుగు, హిందీలో కూడా విడుదలకానుంది.
About Writer
SELVI.M