1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Puri Jagannath

Mahesh Babu | Puri Jagannath | Pokiri | Abhishek Bachan | మళ్లీ "పోకిరి"తో సినిమా తీస్తానంటున్న పూరీ

మహేష్ బాబు
WD
త్వరలో మహేష్ బాబుతో తాను చిత్రాన్ని నిర్మిస్తున్నాననీ, కానీ అది పోకిరి-2 మాత్రం కాదని పూరీ జగన్నాథ్ అన్నారు. "అసలు పోకిరి చిత్రాన్ని అభిషేక్ బచ్చన్‌తో తీద్దామని కథ చెప్పాను. కానీ అది అతనికి నచ్చలేదు. ఆ తర్వాత మరో కథ చెపుదామంటే కుదరలేదు. ఇటీవలే మళ్లీ అమితాబ్‌కు ఓ కథ చెప్పాను. ఆ కథను వీలు చూసుకుని సెట్‌పైకి తీసుకెళతానని చెప్పార"న్నారు జగన్నాథ్.

ఆంగ్లంలో ఓ చిత్రానికి దర్శకత్వం వహించాలని ఉవ్విళ్లూరుతున్నారనే వార్తలొస్తున్నాయిగా అని పూరీని అడిగినప్పుడు... "ఆ కథ రెడీగానే ఉంది. దానిని తీయాలంటే వందకోట్లు ఖర్చవుతుంది. తీసే నిర్మాత ఉంటే నేను చేయడానికి రెడీ" అన్నారు. మహేష్ బాబు చిత్రం గురించి చెపుతూ... వచ్చే ఏడాదిలో ఆ చిత్రాన్ని చేస్తామన్నారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT