1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Amayakudu

Krishnudu| Amayakudu| Vinayakudu| Ananya| Songs Recording | "అమాయకుడు"గా వస్తోన్న వినాయకుడు

కృష్ణుడు
WD
వినాయకుడు ఫేమ్ కృష్ణుడు హీరోగా భారతీ గణేష్ దర్శకత్వంలో రూపొందుతోన్న "అమాయకుడు" చిత్రం క్లైమాక్స్‌తో పాటు ఆరు పాటల చిత్రీకరణ పూర్తయిందని నిర్మాతలు బాలమురుగన్, అనిల్, సుదర్శన్‌లు చెప్పారు.

ప్రస్తుతం మణికంఠ ఖిద్రి దర్శకత్వంలో వనమాలితో ఆరుపాటల రికార్డింగ్ ప్రారంభించామన్నారు. వచ్చేనెలలో షూటింగ్‌లో పూర్తి చేస్తామని నిర్మాతలు వెల్లడించారు. ఇందులో తమిళసూపర్‌హిట్ "నాడోడిగళ్" ఫేమ్ అనన్య హీరోయిన్‌గా నటిస్తోందని వారు తెలిపారు.

దర్శకుడు మాట్లాడుతూ.. కృష్ణుడు క్యారెక్టర్‌కు తగిన కథ ఇదని, గత చిత్రాలకంటే ఎంటర్‌టైన్‌మెంట్, సెంటిమెంట్ వంటి అన్ని అంశాలు ఇందులో ఉన్నాయని చెప్పారు. ఇంకా చరణ్, రావురమేష్, గీతాసింగ్ తదితరులు ఇందులో నటిస్తున్నారు.
About Writer
SELVI.M