Uday Babu| Babu Mohan| Dasara| Shooting| Sammakka Sarakka Mahatyam | అనిల్ ఆర్ట్ ప్రొడక్షన్స్‌పై ఉదయ్‌బాబు రెండో చిత్రం
WD
గతంలో "సమ్మక సారక్క మహాత్మ్యం" అనే చిత్రానికి పనిచేసిన వీరంతా తిరిగి ఉదయ్‌బాబు కొత్త సినిమాకు కూడా పనిచేయడం విశేషం. హీరోపై తీసిన తొలిషాట్‌కు శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి క్లాప్ కొట్టారు. అచ్చిరెడ్డి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. పరుచూరి గోపాలకృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. బాబూమోహన్ తనకు 25 సంవత్సరాలుగా పరిచయమన్నారు. పి. బాబుమోహన్ అయితే ఆయనను పరుచూరి బాబూమోహన్ అని సరదాగా పిలిచేవాళ్లమని చెప్పారు. ఆయన తనయుడు హీరోగా చేయడం ఎంతో ఆనందంగా ఉందని, తొలిచిత్రం సమ్మక్క సారక్కలో.. ఉదయ్ చక్కని నటనను ప్రదర్శించాడని, ఈ చిత్రంలోనూ సక్సెస్ సాధిస్తాడనే నమ్మకముందన్నారు.
బాబూ మోహన్ మాట్లాడుతూ.. నవంబర్‌లో రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించి, జనవరితో చిత్రాన్ని పూర్తిచేస్తామన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని చెప్పారు. హీరో ఉదయ్‌బాబు మాట్లాడుతూ.. ఇది పక్కామాస్ చిత్రమని, మంచి కథకథనంతో మీ ముందుకు వస్తున్నానని వెల్లడించారు.