Annamayya Sakala Devatharchana| Music| Launch| Kosaraju Nayanthara| Venkatesh| Ramanaidu | "అన్నమయ్య సకలదేవతార్చన" పాటల ఆల్బమ్ విడుదల
WD
ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ.. కొసరాజు రాఘవయ్య తనకు మామయ్య అవుతారు. తాను సినిమా తీస్తుంటే దానికి అన్ని విధాల సహాయం చేస్తారని చెప్పారు. మా సినిమాలకు ఆయన రాసిన పాటలు పెద్ద విజయం సంపాదించిపెట్టాయన్నారు. ఆయన మునిమనుమరాలు నయనతారకు గాయనిగా మంచి భవిష్యత్ ఉందని దీవించారు.
విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. దీన్ని తన బిడ్డ కార్యక్రమంగా భావిస్తున్నానని.. ఆ అమ్మాయి పాడుతుంటే దేవుని సన్నిధానంలోనికి తీసుకుని వెళ్ళే విధంగా ఉందన్నారు.