1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Foundation

AR Rahman | Foundation | Jai Ho | Music | Oscars Winner | Hariharan | ఈనెల 11న ఏఆర్.రెహ్మాన్ "జయహో" సంగీత విభావరి

సంగీతం
Srini
WD
అంతర్జాతీయ చలనచిత్ర యవనికపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన సంగీత మేధావి ఏఆర్.రెహ్మాన్ మార్గనిర్ధేశకత్వంలో "జయహో" సంగీత విభావరి కార్యక్రమం జరుగనుంది. తమిళనాడు రాష్ట్ర రాజధానికి సమీపంలోని కాంచీపురం సమీపంలో ఈ మ్యూజికల్ నైట్ నిర్వహించనున్నారు. ఈనెల 11వ తేదీన జరిగే ఈ సంగీత విభావరిని ప్రముఖ రియల్ ఎస్టేట్ రంగ సంస్థ మార్గ్ స్వర్ణభూమి నిర్వహిస్తోంది.

గురువారం చెన్నయ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రెహ్మాన్ దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆస్కార్ అవార్డు స్వీకరించిన తర్వాత తాను చెన్నయ్‌లో నిర్వహిస్తున్న తొలి కచేరి ఇదేనని వెల్లడించారు. ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ శ్రీ శక్తి ఫౌండేషన్ కోసం నిధుల సమీకరణ కోసం దీన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

జయహో వరల్డ్ టూర్ కాన్సెప్ట్ పేరిట దీన్ని నిర్వహిస్తున్నట్టు రెహ్మాన్ వివరించారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఈ సంగీత విభావరిలో హరిహరణ్, శివమణి, సాధనా సర్గమ్, బ్లేజ్, బెన్నీ డయాల్ తదితర కళాకారులు పాల్గొంటారన్నారు. అంతకుముందు మార్గ్ గ్రూపు ఛైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ జీఆర్‌కె.రెడ్డి మాట్లాడుతూ.. సేవా దృక్పథంతో కూడిన ఒక కార్యక్రమం కోసం ఏఆర్.రెహ్మాన్, శ్రీ శక్తి ఫౌండేషన్‌తో చేతులు కలపడం చాలా ఆనందంగా ఉందన్నారు.
Srini
WD


భారతీయ సంగీతానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఘనత రెహ్మాన్‌కే దక్కుతుందన్నారు. దీనికి నిదర్శనమే ఆస్కార్ అవార్డు అని రెడ్డి చెప్పారు. ఇలాంటి సంగీత మేధావి ఆధ్వర్యంలో నిర్వహించే సంగీత విభావరి చెన్నయ్ వాసుల కోసం నిర్వహించడం మరచిపోలేని అనుభూతిని ఇస్తుందని చెప్పారు.

ఇదిలావుండగా, మార్గ్ స్వర్ణభూమి కాంచీపురం సమీరంలో వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో 600 రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్స్‌ను నిర్మించ తలపెట్టింది. గత యేడాది ఫిబ్రవరి నెలలో ఈ ప్రాజెక్టుకు భూమి పూజ జరుగగా, ప్రాథమి మౌలిక సదుపాయాల రూపకల్పన ఇప్పటికే పూర్తయినట్టు చెప్పారు. అంతర్జాతీయ స్థాయి హెల్త్ కేర్, ఎంటర్‌టైన్‌మెంట్, షాపింగ్ డెస్టినేషన్ తదితర సౌకర్యాలతో దీన్ని రూపొందిస్తున్నట్టు రెడ్డి తెలిపారు.
About Writer
PNR