MegaStar| Chiranjeevi| Vikramarka| Shooting| Tirupati| Padmanabham| Allu Ramalingaiah Award | అస్వస్థతకు గురైన మెగాస్టార్ చిరంజీవి!
FILE
గతంలో " రాజా విక్రమార్క" షూటింగ్‌లో జరిగిన పోరాట సన్నివేశంలో ఆయనకు ఎముకలపై దెబ్బలు తగిలాయి. ఆ తర్వాత మరి కొంతకాలానికి "దొంగ" చిత్రం సమయంలోనూ అదే ప్రాంతంలో దెబ్బలు తగలడంతో కొంతకాలం షూటింగ్‌లకు దూరంగా ఉన్నారు.
ఆ తర్వాత తగిన ట్రీట్‌మెంట్ తీసుకుని కోలుకున్నారు. అయితే, ఇటీవల తిరుపతి పర్యటనలో ఆయనను కలిసేందుకు పలువురు అభిమానులు అత్యుత్సాహం చూపి ఆయనపైకి తోసుకువచ్చారు.
ఎంత సెక్యూరిటీ ఉన్నా అభిమానం ముందు ఆగలేదు. పెల్లుబికిన అభిమానం చిరంజీవిని అనారోగ్యం పాల్జేసింది. తిరిగి అదే ప్రాంతం ఒత్తిడికి గురి కావడంతో విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత విజయవాడ పర్యటనలోకూడా నొప్పి రావడంతో పర్యటన వాయిదా పడింది.
ఇదిలా ఉండగా.. గురువారం నటుడు పద్మనాభానికి అల్లురామలింగయ్య అవార్డు ప్రదానం చేయడానికి ఆయన రావాల్సి ఉంది. కానీ పక్కటెముకల నొప్పితో బాధపడుతున్న చిరంజీవి రాలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే అప్పటికే ఆహ్వాన పత్రాలు ముద్రించడంతో.. చేసేది లేక.. వస్తున్నట్లు ప్రకటించారు.
సాయంత్రం 4.45గంటలకు ప్రారంభం కావాల్సిన ఫంక్షన్ 8 గంటలకుగానీ మొదలు కాలేదు. అప్పటికే అభిమానులు తరలివచ్చారు. చిరంజీవి రాకపోవడంతో నిరాశ చెందారు.