1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Audio

Jayee Bhava| Audio| Elephant| Dog| Hari Krishna| NTR| Fans| Kalyan Ram | కుక్క మొరిగిందని స్టేజీపైనే అనలేను: హరికృష్ణ

జయీభవ
WD
ఏనుగు పోతుంటే కుక్కలు మొరుగుతాయి. దీన్ని సామెతగా తీసుకుంటారు. అలాంటిదే నందమూరి హరికృష్ణ తన అభిమానులు అన్నమాటను తనమాటగా తీసుకోమన్నారు.

వివరాల్లోకి వెళితే.. హరికృష్ణ తనయుడు నందమూరి కళ్యాణ్‌రామ్ నటించిన "జయీభవ" ఆడియో వేడుక గురువారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న హరికృష్ణ మాట్లాడుతూ.. ఈ మధ్య ఎన్.టి. రామారావు చరిత్రను కొంతమంది చిలువలు పలువలు చేస్తున్నారు. ఇండస్ట్రీలోకి రావడానికి ఎంతో మంది కృషి చేశారని చెబుతున్నారు.

అయితే "ఎన్టీఆర్ గురించి అస్సలు ఎవరూ చెప్పడం లేదు. అనగానే.. అభిమానులు ఏనుగు పోతుంటే కుక్కమొరిగిందని అనుకోండని, దానివల్ల ఏనుగు ప్రతిష్టకు ఎలాంటి భంగం కలగదని అరిచారు. మీరన్నది కరెక్ట్. కానీ నేను స్టేజీ పైనే ఉన్నాను. "కుక్కమొరిగిందని నేను అనలేనని, అందుచేత అభిమానుల మాటను నేనన్నట్లు తీసుకోమని హరికృష్ణ సమాధానమిచ్చారు.

బ్రహ్మానందరెడ్డి ఉన్నపుడు చిత్రపురి పేరుతో ఎల్.వి.ప్రసాద్, నాన్న విజయవాడ రోడ్డులో స్టూడియోను స్థాపించారు. అక్కడే సినిమాల్లో నటించారు. మదరాసు నుంచి మకాం మార్చి చాలా సినిమాలు ఇక్కడే నటించారు. తెలుగు చిత్రసీమల ఓ వెలుగు వెలిగి రాజకీయ రంగంలో రాణించిన ఎన్టీఆర్ పేరును ఎక్కడా చెప్పుకోక పోవడం శోచనీయమని వ్యాఖ్యానించారు.
About Writer
SELVI.M