1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Audio

Jayee Bhava| Audio| Kalyan Ram| Hansika| Junior NTR| Luck | తాతయ్య వారసులు కావడం మా అదృష్టం: జూ.ఎన్టీఆర్

జయీభవ
WD
నందమూరి కళ్యాణ్ రామ్, హన్సిక నటించిన "జయీభవ" చిత్ర ఆడియో ఆవిష్కరణ గురువారం రాత్రి హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడా సినీ విలేజ్‌లో ఘనంగా జరిగింది.

ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన కేసెట్‌ను మోహన్‌బాబు విడుదలచేసి హరికృష్ణకు అందించారు. అనంతరం సీడీని బాలకృష్ణ విడుదలచేసి జూనియర్ ఎన్టీఆర్‌కు అందజేశారు. "జయీభవ" ఆడియో విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథుల వ్యాఖ్యలు మీ కోసం..

గాలిమాటలు మాట్లాడను: మోహన్‌బాబు
నేను ఎన్టీఆర్ అభిమానిని. అన్నయ్య అంటూ ఆయన్ని పిలుస్తాను. చదువుకునే రోజుల్లో థియేటర్లో ఎన్టీఆర్ సినిమా చూసి ఆయన అభిమానినయ్యాను. ఏదో అవసరం ఉంది కాబట్టి మాట్లాడే కొంతమంది గాలివాటం మాటలు నేను మాట్లాడను. అలా మాట్లాడే వారి పేర్లను అసలు చెప్పను. వారెవరో మీకే తెలుసు.
WD


నందమూరి కుటుంబంతో నాకు ఎంతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఏ ఫంక్షన్ జరిగినా నన్ను కళ్యాణ్ రామ్ పిలుస్తాడు. మొదటిసినిమా నుంచి ప్రతి సినిమాకు నన్ను ఆహ్వానించాడు. ఇంకా చెప్పాలంటే.. కళ్యాణ్ రామ్ మంచి వ్యక్తి. అతనికి భక్తి, విశ్వాసాలు గల భార్య లభించడం అదృష్టం. అంతేకాదు.. ఒకే వర్గానికి చెందినవాడుగా కళ్యాణ్ రామ్ లేకుండా.. అందరికి పనికివచ్చే పువ్వుగా కళ్యాణ్ ఉన్నాడని మోహన్ బాబు అభివర్ణించారు.

బాలయ్య తొడకొడితే ఎదుటివాడికి ఎరుపెక్కుద్ది: అలీ
డైలాగ్ చెప్పినా, డాన్స్ వేసినా, తొడకొట్టినా ఒక నందమూరి వంశమే చేయాలి. బాలయ్య తొడకొడితే ఎదుటివాడికి ఎరుపెక్కింది. ఆ వంశంలోనివాడు కళ్యాణ్ రామ్.. రేపు అందరిచేత "జయీభవ" అనిపించుకుంటాడు.

ఎన్టీఆర్ అభిమానిని: తేజ
నేను ఎన్టీఆర్ అభిమానిని. నా తొలి సినిమా "చిత్రం" ఓపెనింగ్ షాట్, క్లోజింగ్ షాట్ ఎన్టీఆర్ విగ్రహంపై తీశాను. కళ్యాణ్‌రామ్‌తో "లక్ష్మీకళ్యాణం" చేశాను. రాయలసీమలో ఎర్రటి ఎండలో ఇగో లేకుండా నాతో ఎంతగానో సహకరించారు.

తాతయ్య వారసులు కావడం మా అదృష్టం: జూ.ఎన్టీఆర్
మీ కడుపున ఎన్టీఆర్ పుట్టడం అదృష్టం అని మోహన్‌బాబు ఇప్పుడే మా నాన్నతో అన్నారు. గొప్ప తండ్రి కడుపులో మేము పుట్టడం అదృష్టంగా భావిస్తున్నాం. కానీ మేమంతా తాతయ్య వారసులుగా పుట్టడం మరింత అదృష్టమని ఎన్టీఆర్ పేర్కొన్నారు.

దానవీరశూరకర్ణలోనిది టైటిల్: బాలయ్య
"జయీభవ" అనేది నాన్నగారు నటించిన "దానవీర శూరకర్ణలోని" దుర్యోధనుని పాత్ర ప్రవేశంలో వచ్చే సాంగ్. జయీభవ.. విజయీభవ.. ఆ రేంజ్‌లో సినిమా ఉంటుంది. గత చిత్రాలకు మించిన సక్సెస్‌ను కళ్యాణ్‌రామ్ పొందుతాడని బాలయ్య అన్నారు.
About Writer
SELVI.M