Prakash Raj| Bhumika| Okkadu| Mahesh Babu| Tollywood Prince| Family Entertainer | ప్రకాష్ రాజ్, భూమిక జంటగా కొత్త చిత్రం!
WD
ఈ సినిమా సంగతులను శనివారం చిత్ర దర్శకుడు టేకుల కృపాకరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా దీన్ని రూపొందిస్తున్నామన్నారు. క్లీన్ ఫ్యామిలి ఎంటర్‌టైనర్ అయిన ఈ చిత్రం ప్రధానంగా భార్యభర్తల మధ్య ఉండాల్సిన బంధాలు, అనుబంధాలు, అనురాగం, ఆప్యాయతలు వంటి అంశాల చుట్టూ తిరుగుతుందని చెప్పారు.
దంపతుల మధ్య ఉండాల్సిన అవగాహన, ఆలోచనలు సవ్యదిశలో ఉంటే సంసారం ఎలా ఉంటుంది? అపసవ్యదిశలో ఉంటే ఎలా ఉంటుందో కథానుగుణంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు కృపాకరరెడ్డి తెలిపారు. గతనెల 25 నుంచి ఈ నెల 4వరకు జరిగే సన్నివేశాల చిత్రీకరణలో తొలిషెడ్యూల్ పూర్తవుతుంది. తిరిగి 15 నుంచి నెలాఖరు వరకు, నవంబర్ నెలలో జరిగే షెడ్యూల్తో సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంటుందని దర్శకుడు వెల్లడించారు.
చిత్ర నిర్మాతలు వి. వనితారెడ్డి, ఎ. రాధికారెడ్డి మాట్లాడుతూ.. డిసెంబరులో నిర్మాణాంతర కార్యక్రమాలు జరిపి జనవరి నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని చెప్పారు. ఇంకా ఈ చిత్రానికి రచన: పరుచూరి బ్రదర్స్, సంగీతం: చిన్నా, కెమెరా: పూర్ణ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: టేకుల కృపాకరరెడ్డి.