1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Atu Itu

Teja| Atu Itu| Jayam| Keka| Kick| Shyam| Hero| Heroines | జయం మూవీస్‌పై తేజ కొత్త చిత్రం!

తేజ
WD
"కేక" తర్వాత ప్రముఖ దర్శకుడు తేజ కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టనున్నారు. జయం మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై "అటు ఇటు" పేరుతో కొత్త సినిమాను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

డి. సురేష్‌బాబు సమర్పణలో శ్రీవల్లీతేజ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. "కిక్" ఫేమ్ శ్యామ్ ఇందులో ప్రధానపాత్ర పోషిస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. హీరోహీరోయిన్ల పాత్రల మినహా అన్ని పాత్రల ఎంపిక పూర్తయిందన్నారు. హీరోహీరోయిన్ల కోసం 16-20 మధ్య యువతీ, యువకులు తమను సంప్రదించవచ్చునని తెలిపారు.

దర్శకుడిగా ఇంకా ఎవరనేది నిర్ణయించలేదని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: కళ్యాణిమాలిక్, కెమెరా: రసూల్, సమర్పణ: డి. సురేష్ బాబు.
About Writer
SELVI.M