హ్యాపీడేస్ ఫేమ్ కృష్ణుడు కీలక పాత్రలో ఆల్తాఫ్, హ్యాపీడేస్ ఫేమ్ కృతిక క్రిష్ణన్ హీరోయిన్‌గా నటిస్తోన్న "చేత వెన్నముద్ద" చిత్రం సగం పూర్తయింది. రోహిత్. ఎస్. అభ్యుదయ్ దర్శకత్వంలో ఫుల్‌మూన్ పిక్చర్స్ పతాకంపై పి.ఆర్.కుమార్ నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం గురించి ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఎమ్. భరత్ మాట్లాడుతూ.. ఇటీవలే కృష్ణుడు స్పెయిన్ అమ్మాయి అన్నాజెన్, మెటిల్డా, మైక్, శశిలపై కామెడీ సన్నివేశాలను చిత్రీకరించడంలో సినిమా సగం పూర్తయ్యిందన్నారు.
ఈ నెలద్వితీయార్థం నుంచి జరిగే షెడ్యూల్‌తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. సంగీతదర్శకుడు రవిస్వరూపన్, లావణ్య ద్వయం అందించిన బాణీలు అద్భుతంగా వచ్చాయని ఎగ్జిక్యూటివ్ నిర్మాత వెల్లడించారు.
దర్శకుడు రోహిత్.ఎస్. అభ్యుదయ్ మాట్లాడుతూ.. ఇద్దరు గాఢ ప్రేమికుల మధ్య ఏర్పడ్డ శూన్యతను కాలం ఎలా పరిష్కరించింది అనేది ఈ చిత్ర కథాంశం అని చెప్పారు.
సహ నిర్మాత పామరాజు జానకిరామ్ మాట్లాడుతూ.. తెలుగులో తొలిసారిగా మెర్సీకిల్లింగ్‌పై నిర్మిస్తోన్న చిత్రమిదని, హీరో ఆల్తాఫ్, హ్యాపీడేస్ ఫేమ్ క్రితిక కృష్ణన్‌లపై చిత్రీకరించిన ప్రేమ సన్నివేశాలు ప్రేమికుల్లో కొత్త అనుభూతిని కలిగిస్తాయని పామరాజు అన్నారు.
మెర్సీ కిల్లింగ్‌పై రూపొందుతోన్న ఈ ప్రేమకథా చిత్రాన్ని ప్రేమికులు తప్పకుండా చూసేలా ఉంటుందని సహ నిర్మాత తెలిపారు. చివరి షెడ్యూల్‌లో రెండు పాటలను చిత్రీకరిస్తామని, పాటలను అక్టోబర్ నెలాఖరున విడుదల చేసి, సినిమాను నవంబరులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు పామరాజు చెప్పారు.
సమర్పకుడు బెల్లంకొండ రఘు మాట్లాడుతూ.. ఆది నుంచి సినిమా పూర్తయ్యేవరకు కృష్ణుడు ప్రేక్షకులను నవ్విస్తూనే ఉంటాడు. మెర్సీకిల్లింగ్‌పై రూపొందుతున్న కొత్త కాన్సెప్ట్‌ను తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకముందన్నారు.
ఇంకా ఈ చిత్రానికి సంగీతం: రవి స్వరూపన్-లావణ్య, కెమెరా: రవి. కె, నీర్ల, పాటలు: రవిస్వరూపన్, ఇమంది రామారావు, కథ: వి.ఎన్. సతీష్, మాటలు: మోహన్ తుమ్మల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: ఎమ్. భరత్‌కుమార్, సి.ఎస్. కుమార్, స్క్రీన్‌ప్లే, సహనిర్మాత: పామరాజు జానకిరామ్, నిర్మాణ నిర్వహణ: శ్రీకాంత్ వడ్ల, నిర్మాత: పి.ఆర్.కుమార్, దర్శకత్వం: రోహిత్. ఎస్. అభ్యుదయ్.