1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Jeneelia

Ram Charan Teja | Jeneelia | Anjana Productions | Nagendra Babu | "మగధీర" రామ్‌చరణ్‌తో "బొమ్మరిల్లు" జెనీలీయా

రామ్ చరణ్ తేజ
WD
సుప్రసిద్ధ సంస్థ అంజనా ప్రొడక్షన్స్ "మగధీర" రామ్‌చరణ్‌తో ఓ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ చిత్రంలో చరణ్ సరసన నటింపజేసేందుకు ఎందరో హీరోయిన్లను చూశారట. కానీ "పంచదార చిలక"లాంటి జెనీలియా కరెక్టుగా సబ్జెక్టుకు తగినట్లు అతికినట్లు ఉండటంతో ఆమెను ఎంపిక చేశారట.

మరో విశేషమేమిటంటే, ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్నది బొమ్మరిల్లు భాస్కర్. ఈ చిత్రం తాలూకు పాటల రికార్డింగ్ కార్యక్రమాన్ని అక్టోబరు 21న ప్రారంభించనున్నట్లు నాగేంద్రబాబు తెలియజేశారు. హారిస్ జయరాజ్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.

మహా బిగ్ సక్సెస్ ఇచ్చిన మగధీర చిత్రం తర్వాత అంతటి భారీ స్థాయిలో ఈ చిత్రం ఉంటుందని నాగేంద్రబాబు అంటున్నారు. అయితే ఇది చారిత్రాత్మక నేపధ్యంలో సాగుతుందా...? అనే ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పకుండా... ప్రేమ, యాక్షన్, సెంటిమెంట్ కలయికతో తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని ఆస్ట్రేలియా, అమెరికాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా చిత్రీకరించనున్నట్లు తెలిపారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT