Young India| Cinema| Dasari Narayana Rao| Hero| Heroines| Villain| Character Actors | యమస్పీడ్‌గా "యంగ్ ఇండియా" షూటింగ్ సన్నాహాలు
WD
అందరూ కొత్త వాళ్లతో రూపొందుతోన్న ఈ చిత్రం కోసం "నూతన నటీనటులు కావలెను" అంటూ విడుదల చేసిన పత్రికా ప్రకటనలకు విశేష స్పందన లభించింది.
మొత్తం 22వేల అప్లికేషన్లు రాగా అందులో 640 మందిని ఇంటర్వ్యూలకు ఎంపిక చేయడం జరిగింది. ఆ 640 నుంచి 60 మంది కమెడియన్స్‌గా, క్యారెక్టర్ యాక్టర్స్‌గా, ఇతరత్రా పాత్రలకు ఎంపికచేశారు.
ఇక హీరోహీరోయిన్లు, సపోర్టింగ్ హీరోహీరోయిన్లు, విలన్ పాత్రలకోసం జరిగిన ఎంపికలో మొత్తం 29మందిని సెలక్ట్ చేశారు. 20మంది బాయ్స్, 9మంది గర్ల్స్‌తో కూడిన ఈ బ్యాచ్‌కు నెలరోజుల పాటు డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, స్టెయిలింగ్ మున్నగు అంశాలలో కఠోర శిక్షణ ఇచ్చారు.
కాగా అక్టోబర్ 6, 7, 8 తేదీలలో రామోజీ ఫిలింసిటీలో స్క్రీన్‌టెస్టులు నిర్వహిస్తున్నారు. ఈ స్క్రీన్ టెస్టుల ద్వారా ఫైన్ బ్యాచ్‌ని ఎంపిక చేస్తామని చిత్ర నిర్మాత, సౌభాగ్య మీడియా అధినేత రామకృష్ణ ప్రసాద్ తెలియజేశారు.
కథ ప్రకారం "యంగ్ ఇండియా" చిత్రంలోని పాత్రలకు సరిపడని ఇతర సెలక్టెడ్ ఆర్టిస్టులకు తమ తదుపరి చిత్రంలో అవకాశం కల్పిస్తామని నిర్మాత వెల్లడించారు.
ఇప్పటికే ఈ చిత్రం కోసం కీరవాణి సంగీత సారధ్యంలో ఆరు పాటలకు రికార్డింగ్ పూర్తయింది. స్క్రిప్ట్ వర్క్ కూడా ముగిసింది. త్వరలో షూటింగ్ కార్యక్రమాలను ప్రారంభిస్తున్నామని నిర్మాత రామకృష్ణ ప్రసాద్ తెలిపారు.