1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Shyam

Y.S. Rajasekhara Reddy| Shyam| Kick| Puri Jagannath| Actor Rajasekhar | డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డిగా రాజశేఖర్ నటించట్లేదు

డా వైఎస్ రాజశేఖర రెడ్డి
WD
దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్. వై.ఎస్. రాజశేఖర రెడ్డి పేరుతో సినిమా తీయడానికి ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కసరత్తులు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వైఎస్సార్ పాత్రను హీరో రాజశేఖర్ పోషిస్తారేమోనని ఫిలిమ్ నగర్ వర్గాలు భావించాయి.

ఈ విషయాన్నే రాజశేఖర్‌తో సినిమా ఎనౌన్స్‌మెంట్‌లో అడిగితే టైటిల్, కథ రాసుకున్నాను. కానీ వై.ఎస్ మరణించడంతోనే కథను మార్చి వైఎస్సార్ పేరుతో తీయాలని పూరీ సూచించడంతో అంగీకరించానని చెప్పారు. ఈ నేపథ్యంలో.. వైఎస్సార్ పాత్రను ఎవరు పోషిస్తారనే అంశంపై నెలకొన్న ఉత్కంఠకు తెర తొలగింది.

దివంగత మహానేత వైఎస్సార్ పాత్రను తాను పోషిస్తున్నట్లు "కిక్"లో పోలీస్ ఆఫీసర్‌గా నటించిన శ్యామ్ అంగీకరించారు. ఇందుకు సంబంధించిన చర్చలు ఇటీవలే పూరీ జగన్నాథ్‌తో జరిగాయని శ్యామ్ బుధవారం నాడు ప్రకటించారు.

అయితే సినిమా షూటింగ్ ఎప్పుడు ఎలా జరుగుతుందనే విషయాలను ఇంకా తెలియజేయలేదని శ్యామ్ అన్నారు. వైఎస్ పాత్ర పోషించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని శ్యామ్ పేర్కొన్నారు. అలాగే తాజాగా తేజ దర్శకత్వంలో, డి. సురేష్‌బాబు సమర్పణలో నిర్మించనున్న కొత్త చిత్రంలోనూ శ్యామ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
About Writer
SELVI.M