Veedu Manavade| Shyam| Mallika Kapoor| Kick| Tollywood| Kollywood | శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న "వీడు మనవాడే"
WD
తాజా షెడ్యూల్‌ను ఈ నెలాఖరు వరకు జరుపుతామని దర్శకుడు నేతాజీ చెప్పారు. ఈ చిత్రం ఎప్పుడో పూర్తి కావాల్సి ఉన్నా.. తమిళంలో మరొక చిత్రం అంగీకరించడంతో ఆ చిత్రానికి పనిచేయాల్సి వచ్చిందని తెలిపారు. ఈ సినిమా షూటింగ్ కులుమనాలి, చెన్నై, మహాబళేశ్వరం తదితర ప్రాంతాల్లో చిత్రీకరించామని చెప్పారు.
తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రం తమిళంలో ఇటీవలే విడుదలైందని, తెలుగు వర్షన్ నేటివిటీకి తగినట్లు మళ్లీ షూటింగ్ చేస్తున్నామని దర్శకుడు పేర్కొన్నారు.
హీరో శ్యామ్ మాట్లాడుతూ.. తాను ఇందులో చేపలు పట్టే వ్యక్తిగా నటిస్తున్నానని చెప్పారు. ఈ చిత్రం ద్వారా తనకు మంచి గుర్తింపు వస్తుందని శ్యామ్ ఆశించారు. ఇందులో విజయభాస్కర్ బ్లైండ్ పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.
ఇంకా రామిరెడ్డి, సైరాభాను, వేణుమాధవ్, రంగనాథ్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి కెమెరా: గాదిరాజు శ్రీనివాస్, మాటలు: లతా నేతాజీ, ఫైట్స్: ఆనంద్.