1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. New Movie

B.V.M. Productions| New Movie| Madhu| Shooting| Youthful Entertainer | బి.వి.ఎం. ప్రొడక్షన్స్‌పై కొత్త చిత్రం ప్రారంభం

బివిఎం ప్రొడక్షన్స్
WD
బి.వి.ఎం. ప్రొడక్షన్స్ పతాకంపై రాజా ఎస్. తాన్ దర్శకత్వంలో మునిరత్నం రెడ్డి నిర్మిస్తోన్న కొత్త చిత్రం షూటింగ్ సారథి స్టూడియోలో బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది. హీరోలు దివేష్, మధులపై తొలిషాట్ చిత్రీకరించారు.

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. డేవిడ్ థావన్, సతీష్ కౌషిక్, డా.ఎల్. శ్రీనాథ్‌ల దగ్గర దర్శకత్వశాఖలో పనిచేశాను. ఎన్నో ఒడిదుడుకులతో కష్టపడి చదివిన నలుగురు కుర్రాళ్లు నేటి సాఫ్ట్‌వేర్ బిజినెస్ పతనమవడంతో తలెత్తిన సమస్యలను ఎలా ఛేదించుకుని తమ జీవితాన్ని సాఫల్యం చేసుకున్నారన్నదే ఈ చిత్ర ఇతివృత్తమని చెప్పారు.

నిర్మాత మునిరత్నం మాట్లాడుతూ.. ఇదొక యూత్‌ఫుల్ ఛాలెంజిక్ ఎంటర్‌టైనర్ అన్నారు. అమెరికాకు చెందిన ఇద్దరు హీరోలు ఇందులో నటిస్తున్నారని తెలిపారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుందన్నారు.

ఇంకా ఈ చిత్రానికి కెమెరా: బుజ్జి, ఎడిటర్: ఆవుల వెంకటేష్, మాటలు: ఎం.కె.ఆర్. అల్లూరి.
About Writer
SELVI.M