NTR | Jr NTR | Flood victims | Donations | Aswinidut | ఎన్టీఆర్‌ది పెద్ద మనసు: అశ్వనీదత్
WD
ఈ సందర్భంగా అశ్వనీదత్ మాట్లాడుతూ... ప్రజలకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా వారిని ఆదుకోవడానికి ఆనాడు మహానటుడు ఎన్టీరామారావుగారు ముందుకు వచ్చేవారు. తాతగారి అడుగు జాడల్లోనే ఈ ఎన్టీఆర్ సేవా కార్యక్రమాలు చేయడం ఎంతైనా అభినందనీయం.
వరద బాధితుల సహాయార్థం 40 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చి తన పెద్ద మనసును, ప్రజల పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్న కళాకారుడు ఎన్టీఆర్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ప్రజాసేవ చేయడంలో తాతగారి బాటలో పయనిస్తున్న ఎన్టీఆర్ ఇలాగే ముందు ముందు కూడా ప్రజాహిత కార్యక్రమాలకు సాయం అందిస్తారని ఆశిస్తున్నాను. ఎన్టీఆర్ కీపిటప్" అన్నారు.