Actor Padmanabham| Ravineni Foundation Award| ShobaRani| NeelamSetti| Hanuma Konda Jagadesh| Solar System | నటుడు పద్మనాభంకు రామినేని ఫౌండేషన్ సత్కారం
WD
ఫౌండేషన్ పదవ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 12వ తేదీ సాయంత్రం హైదరాబాద్‌లోని తాజ్‌డెక్కన్‌లో పురస్కారాలను అందజేసే కార్యక్రమం జరుగనుందని ఫౌండేషన్ ఛైర్మన్ ధర్మ ప్రచారక్ గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్రముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య హాజరవుతుండగా, కన్నాలక్ష్మీనారాయణ, డా. ఐవి. సుబ్బారావు వంటి ప్రముఖులు హాజరుకానున్నారని వెల్లడించారు.
ఇకపోతే.. ఈ ఏడాది విశిష్ట పురస్కారాన్ని సోలార్ సిస్టమ్‌పై ప్రయోగాలు చేసిన హనుమకొండ జగదీష్‌కు అందజేయనున్నారు. 75వేల నగదు, జ్ఞాపికను అందజేస్తారు. మూడు విశిష్ట పురస్కారాల కేటగిరీలో నటుడు పద్మనాభం, నాట్యకారిణి పద్మశ్రీ శోభారాణి, మహిళా వెయిట్ లిఫ్టర్లను తీర్చిదిద్దిన నీలంశెట్టి అప్పన్నలను ఎంపికచేశారు.