1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Telugu

Joy| Telugu| Cinema| Youthful Entertainer| Avitej| Trinath| Parvathy| Vainavi | యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న "జాయ్"

జాయ్
WD
అవితేజ్, త్రినాథ్‌లను హీరోలుగా, పార్వతి, వైనవిలను హీరోయిన్లుగా పరిచయం చేస్తూ.. ఇ.వి.కుమార్ సమర్పణలో "జాయ్" అనే చిత్రం రూపుదిద్దుకుంటోంది. అరుణై పిక్చర్స్ ప్రొడక్షన్ నెం.3గా ఇ.వి.వి. కంభన్ నిర్మిస్తోన్న "జాయ్" యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది.

పలువురు ప్రముఖ దర్శకుల వద్ద దర్శకత్వశాఖలో పనిచేసిన టాలెంటెడ్ డైరక్టర్ బి. రాజా ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న "జాయ్" పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబరులో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చిత్ర దర్శకుడు బి. రాజా అన్నారు. కళాశాల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఎంతో స్నేహంగా ఉంటారు. వారి మధ్య అనుకోకుండా ప్రేమ చిగురిస్తుంది.

అయితే వారి స్నేహానికి ప్రేమ మచ్చకాకూడదన్న ఉద్దేశంలో ప్రేమను మనసులోనే దాచుకుంటారు. ఈ క్రమంలో జరిగే సంఘటనలతో వారి స్నేహం గెలిచిందా? ప్రేమ గెలిచిందా? అనే పాయింట్‌తో ఈ చిత్రం రూపుదిద్దుకుందని రాజా తెలిపారు.

నేటి ట్రెండ్‌కు అనుగుణంగా యూత్‌ని ఆకట్టుకునే అంశాలతో రూపొందిన ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని దర్శకుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంకా ఈ చిత్రానికి విద్యాసాగర్ అందించిన సంగీతం హైలైట్‌గా నిలుస్తుందని, పాటలన్నీ వినసొంపుగా ఉంటాయని రాజా వెల్లడించారు.

నిర్మాత మాట్లాడుతూ.. చక్కని కాన్సెప్ట్‌తో తెరకెక్కనున్న "జాయ్" చిత్రం అందరినీ ఆకట్టుకుంటుదని నమ్మకం వ్యక్తం చేశారు. ఈ నెలలోనే ఒక ప్రముఖ ఆడియో కంపెనీ ద్వారా ఆడియో రిలీజ్ చేసి, నవంబరులో చిత్రాన్ని రిలీజ్ చెయ్యడానికి రంగం సిద్ధం చేస్తున్నామన్నారు.

ఇంకా ఈ చిత్రానికి పాటలు: భువనచంద్ర, మాటలు: స్వర్ణ సుధాకర్, ఎడిటింగ్: వి.టి. విజయన్, ఆర్ట్: వెంగల్ రవి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎన్.గోపాల్.
About Writer
SELVI.M