1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Jagapati babu

Maa Nanna Chiranjeevi | Jagapati babu | Neelima | Master Atulit | నవంబరు మొదటివారంలో "మా నాన్న చిరంజీవి"

మా నాన్న చిరంజీవి
WD
ప్రైమ్‌స్టార్ జగపతిబాబు హీరోగా "తమ్ముడు" ఫేమ్ అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో జయశ్రీ సమర్పణలో లాఫింగ్ లార్డ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న "మా నాన్న చిరంజీవి" అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని నవంబరు మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ చిత్రం గురించి హీరో జగపతిబాబు మాట్లాడుతూ... "అరుణ్ ప్రసాద్ ఈ కథ ఎంత బాగా చెప్పాడో అంతకంటే బాగా డీల్ చేశాడు. అద్భుతంగా తీశాడు. ఈ మధ్యకాలంలో వర్క్‌ని బాగా ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా ఇది. అరుణ్ ప్రసాద్ ప్రతి సన్నివేశాన్ని బ్రహ్మాండంగా తీశాడు.

శుభలగ్నంలా సెంటిమెంటు ఉంటూ మంచి ఎంటర్‌టైన్మెంట్ ప్లస్ యాక్షన్ మిక్సయిన సబ్జెక్ట్ ఇది. ఓ పిల్లాడికి నాకు ఉండే అనుబంధం ఈ కథలో మెయిన్ పాయింట్. మాస్టర్ అతులిత్ ఆ పిల్లాడి క్యారెక్టర్‌లో బాగా నటించాడు. అలాగే హీరోయిన్ నీలిమ మంచి పెర్ఫార్మెన్స్ చేసింది.

నేను మాస్టర్ అతులిత్ పాల్గొన్న ఓ పాటను బ్యాంకాక్‌లో చాలా రిచ్‌గా తీశారు. ఈ సాంగ్ ఈ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంది. నవంబరు మొదటివారంలో విడుదల కానున్న ఈ చిత్రం నా కెరీర్‌లో మరో మంచి చిత్రం అవుతుందన్న నమ్మకం నాకుంది" అన్నారు

ప్రైమ్‌స్టార్ జగపతిబాబు, నీలిమ, మాస్టర్ అతులిత్, అలీ, ఎంఎస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, తెలంగాణా శకుంతల, ఝాన్సీ, బెనర్జీ, సంధ్య, ఆచార్య, సత్యం రాజేష్, వెంకీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హేమచంద్ర, సమర్పణ: జయశ్రీ, నిర్మాణం: లాఫింగ్ లార్డ్ ఎంటర్‌టైన్‌మెంట్స్. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అరుణ్ ప్రసాద్.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT