MAA | Bala Krishna | Chiranjeevi | Murali Mohan | Naga Babu | "మా" బంధం దృఢమైనదేనా...?
WD
మరి ఇప్పుడో... మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనే సంస్థ గొడుగు కింద ఉన్న తెలుగు చలనచిత్ర రంగంలో అడుగడుగునా గ్రూపులు.. గ్రూపు రాజకీయాలు... ఒకరంటే ఒకరికి గిట్టని దౌర్భాగ్యం నేడు తెలుగు సినీ పరిశ్రమలో దాపురించిందని సీనియర్ తెలుగు నటులు వాపోతున్నారు.
ఆయా అగ్రశ్రేణి నటుల మధ్య ఉన్న భేదాభిప్రాయాల వల్ల చిన్న నటులు ఏదో ఒక గ్రూపులోకి వెళ్లాల్సిన అగత్యం. ఎవరి కార్యక్రమానికి హాజరవ్వాలో ఎవరి కార్యక్రమానికి వెళ్లకూడదోనన్న గందరగోళంలో నూతన నటులు ఉంన్నట్లు సమాచారం.
ఇదిలావుంటే.. నిన్న మా అసోసియేషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు చేయూతనివ్వాలన్న అంశంపై హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో నటుల మధ్య ఉన్న గ్రూపులు స్పష్టంగా బహిర్గతమయ్యాయి.
నటుడు మోహన్ బాబు, డాక్టర్ రాజశేఖర్‌లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సమావేశానికి గైర్హాజరైన మెగాస్టార్ చిరంజీవి అండ్ పార్టీని ఉద్దేశించేలా వీరిద్దరి ప్రసంగం సాగింది. ఇలాంటి సమావేశాలకు రాని వారిని పక్కన పెట్టాలని మోహన్ బాబు అన్నారు. అయితే రాజశేఖర్ మాత్రం దూరంగా ఉంచడం మంచిది కాదని, అందరూ కలిసి ముందుకు రావాలని అన్నారు.
ఈ కార్యక్రమాన్ని మా అధ్యక్షుడు మురళీ మోహన్ కాకుండా బాలయ్య ముందు ఉండి నడిపించడం వల్లనే ఈ కార్యక్రమానికి చిరంజీవి కుటుంబానికి సంబంధించిన నటులు రాలేదని పలువురు అనుకోవడం కనిపించింది.