1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Takita Takita

Anushka| Takita Takita| Special Song| Bharath Tagoore| Bhumika | "తకిట తకిట" స్పెషల్ సాంగ్‌లో బొమ్మాళీ స్టెప్పులు!

అనుష్క
ప్రముఖ హీరోయిన్ భూమిక భర్త భరత్ ఠాకూర్ నిర్మాతగా డౌన్‌టౌన్ ఫిలిమ్స్ పతాకంపై శ్రీహరి నాను దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం "తకిట తకిట". నూతన తారాగణంతో నిర్మిస్తోన్న ఈ చిత్రంలో సెక్సీతార అరుంధతి అనుష్క ఓ స్పెషల్ సాంగ్‌లో కన్పించనున్నారు. 

అనుష్కతో పాటు ఎన్టీఆర్ ఆ పాటలో నటిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు.. నాగార్జున ఈ చిత్రంలో గెస్ట్ రోల్ చేస్తున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో "తకిట తకిట" నిర్మాత భరత్‌ఠాకూర్ మాట్లాడుతూ.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పెషల్ సాంగ్‌లో నటిస్తున్నట్లు, కింగ్ నాగార్జున గెస్ట్‌రోల్ చేస్తున్నట్లు వచ్చిన వార్తలన్నీ పుకార్లు మాత్రమేనని కొట్టిపారేశారు.

అయితే అనుష్క స్పెషల్ సాంగ్‌లో నటించడం మాత్రం నిజమేనని, అందరూ కొత్తవారితో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి సంబంధించిన మిగిలిన వివరాలన్నీ త్వరలోనే తెలియజేస్తామన్నారు.