1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Colours Swathi

Vikram| Colours Swathi| Andrea| Aparichitudu| Sivaputrudu| Mallanna| Singanamala| Sri Raghava | విక్రమ్, కలర్స్‌స్వాతి హీరోహీరోయిన్లుగా భారీ చిత్రం!

విక్రమ్
WD
అపరిచితుడు, శివపుత్రుడు, మల్లన్న వంటి సూపర్‌హిట్ చిత్రాల కథానాయకుడు విక్రమ్ హీరోగా, 7జి బృందావన్‌కాలనీ, ఆడవాళ్ళ మాటలకు అర్థాలు వేరులే వంటి బంపర్‌హిట్ చిత్రాల దర్శకుడు శ్రీ రాఘవ రూపొందిస్తోన్న భారీ చిత్రం షూటింగ్ అక్టోబర్ 18న ప్రారంభం కానుంది.

ఇంకా కనకరత్న మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శింగనమల రమేష్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం.

ఈ చిత్రం గురించి హీరో విక్రమ్ మాట్లాడుతూ.. శ్రీ రాఘవ చాలా మంచి దర్శకుడు. ఆయన చెప్పిన కథ నచ్చడంతో ఈ చిత్రం చేస్తున్నానన్నారు. తన కెరీర్‌లో ఇదో డిఫరెంట్ కమర్షియల్ మూవీ అవుతుందని విక్రమ్ నమ్మకం వ్యక్తం చేశారు. ఇంకా శింగనమల రమేష్ పతాకంపై రూపుదిద్దుకుంటోన్న ఈ భారీ చిత్రం తాను నటించడం చాలా హ్యాపీగా ఉందని విక్రమ్ తెలిపారు.

నిర్మాత శింగనమల రమేష్ బాబు మాట్లాడుతూ.. అక్టోబర్ 19 నుంచి నవంబరు 3వరకు లడక్‌లో ఈ చిత్రం షెడ్యూల్ జరుగుతుందన్నారు. నవంబర్ 5 నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తామని నిర్మాత అన్నారు. విక్రమ్ కెరీర్‌లో మరో సెన్సేషనల్ ఫిలిమ్‌గా దర్శకుడు రాఘవ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని శింగనమల వెల్లడించారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బి. బుల్లి సుబ్బారావు మాట్లాడుతూ.. షారూఖ్‌ఖాన్ నటించిన హిందీ "దేవదాసు" చిత్రానికి సంగీతం అందించిన ఇస్మాయిల్ దర్బార్ ఈ సినిమాకు సంగీతం అందించడం విశేషమని చెప్పారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నామని సుబ్బారావు అన్నారు.

విక్రమ్ సరసన కలర్స్ స్వాతి ఓ హీరోయిన్‌గా నటిస్తుండగా, మరో హీరోయిన్‌గా ఆంగ్లో ఇండియన్ ఆండ్రియా నటిస్తోంది. ఇంకా ఈ భారీ చిత్రానికి సంగీతం: ఇస్మాయిల్ దర్బార్, ఫోటోగ్రఫీ: రాంజీ, కళ: రాఘవన్, ఎడిటింగ్: కోలా భాస్కర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బి. బుల్లి సుబ్బారావు, సమర్పణ: ఎస్. సత్యరామమూర్తి, నిర్మాత: శింగనమల రమేష్‌బాబు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీ రాఘవ.
About Writer
SELVI.M