Simha| Cinema| Balakrishna| Sneha Ullal| Namitha| Brahmanandam| Venu Madhav| Ali| Songs | పాటల చిత్రీకరణలో బాలయ్య "సింహా"
WD
యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి సంబంధించిన పాటల చిత్రీకరణ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది.
పాటల చిత్రీకరణకు సంబంధించిన విశేషాలను నిర్మాత పరుచూరి కిరీటి తెలియజేస్తూ.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ఎ.ఎస్. ప్రకాష్ కళాదర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో వేసిన మూడు సెట్స్‌లో ప్రేమ్‌రక్షిత్ నృత్యదర్శకత్వంలో బాలకృష్ణ, నమితలపై ఓ పాటను చిత్రీకరిస్తున్నామన్నారు.
ఈ నెలాఖరులో రామోజీ ఫిల్మ్‌సిటీలోనే మరో మూడు భారీ సెట్స్ వేసి బాలకృష్ణ, స్నేహా ఉల్లాల్‌లపై మరో పాటను చిత్రీకరించబోతున్నట్లు నిర్మాత వెల్లడించారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బి. మహేంద్రబాబు మాట్లాడుతూ.. ఏకధాటిగా హైదరాబాద్, వైజాగ్‌లలో జరిగే షూటింగ్‌తో సినిమా పూర్తవుతుందన్నారు. సంక్రాంతి కానుకగా సింహాని రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.
యువరత్న బాలకృష్ణ, స్నేహాఉల్లాల్, నమిత, రఘు, కోటశ్రీనివాసరావు, ఆదిత్యమీనన్, కె.ఆర్. విజయ, బ్రహ్మానందం, వేణుమాధవ్, అలీ, ధర్మవరపు, కృష్ణభగవాన్, ఎల్.బి.శ్రీరాం, ఝాన్సీ, సన, సైరాభాను, వినోద్ ప్రముఖ మలయాళ విలన్ సాయికుమార్ నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: చక్రి, ఫోటోగ్రఫీ: ఆర్థ్రర్ ఎ. విల్సన్, ఫైట్స్: స్టన్ శివ, ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాష్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు, ప్రొడక్షన్ కంట్రోలర్: డి. యోగానంద్.