Kick| Hindi| Salman Khan| Telugu| Tamil| Sajid Nadiadwala| Raviteja| Ghajini| Pokiri | "కిక్" హిందీ రీమేక్‌లో హీరోగా నటించనున్న సల్మాన్ ఖాన్!
FILE
ఆర్. ఆర్.మూవీ మేకర్స్ నుంచి సాజిద్ నాడియాద్‌వాద్‌వాలా హిందీ రైట్స్ తీసుకుని కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌తో రీమేక్ చెయ్యబోతున్నారు. సౌత్ నుండి వెళ్ళిన గజిని, తెలుగు నుంచి వెళ్ళిన పోకిరి సూపర్ హిట్ అవడంతో హిందీ నిర్మాతలు తెలుగు సూపర్ హిట్ చిత్రాల రీమేక్ రైట్స్‌పై ఆసక్తి చూపడం విశేషం.
వెంకట్ నిర్మించిన "కిక్" హిందీలో రీమేక్ కావడం హ్యాపీగా ఉందని చిత్ర సమర్పకులు కె. అచ్చిరెడ్డి, కో-ప్రొడ్యూసర్ వి. సురేష్ రెడ్డి చెప్పారు. "కిక్" చిత్రాన్ని తమిళంలో ఎడిటర్ మోహన్, హిందీలో సాజిద్ నాడియాద్‌వాలా రీమేక్ చెయ్యడం పట్ల నిర్మాత, ఆర్.ఆర్. మూవీ మేకర్స్ అధినేత వెంకట్ హర్షం వ్యక్తం చేశారు.