Puli cinema| Pavan Kalyan| S.J, Surya| Kushi| Nikisha Patel| Takie part | టాకీని పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్ "పులి"
WD
ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ.. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మరో పవర్‌ఫుల్ ఫిలిమ్‌గా, సూర్య దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న "పులి" టాకీని పూర్తి చేసుకుందన్నారు.
దర్శకుడు ఎస్.జె. సూర్య మాట్లాడుతూ.. నిజంగా "పులి" ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో, పవన్ ఈ చిత్రం చెయ్యడం చాలా థ్రిల్లింగ్ ఉంది. ఖుషి తర్వాత తమ బ్యానర్‌పై వస్తోన్న "పులి" అన్ని అంచనాలకు మించి పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ సరసన నిఖిషా పటేల్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో మనోజ్ బాజ్‌పాయ్, చరణ్ రాజ్, నాజర్, జ్యోతికృష్ణ, శరణ్య, బ్రహ్మాజీ, అలీ, కోవైసరళ, విఎంసి హనీఫా, గిరీష్ కర్నాడ్ తదితరులు నటిస్తున్నారు.
ఇంకా ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్. రెహమాన్, ఫోటోగ్రఫీ: బినోద్ ప్రధాన్, ఆర్ట్: ఆనందసాయి, ప్రొడక్షన్: కిషోర్, రాంబాబు, సత్యం, సమర్పణ: ఎస్. సత్యరామమూర్తి.