1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Chiranjeevi

Srikanth| Chiranjeevi| Politics| Mahatma Cinema| PRP| Krishna Vamsi | అన్నయ్య పార్టీలో చేరే ఆలోచనే రాలేదు: శ్రీకాంత్

నాకు రాజకీయాలంటే అసలు పడవు..!

శ్రీకాంత్
WD
తనకు రాజకీయాలంటే అసలు పడవని ప్రముఖ నటుడు శ్రీకాంత్ అన్నారు. ఇటీవలే కృష్ణవంశీ దర్శకత్వంలో రూపుదిద్దుకుని తెరకెక్కిన "మహాత్మా"తో వంద చిత్రాల్లో నటించిన శ్రీకాంత్‌ను "తెలుగు ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్" సోమవారం ఘనంగా సత్కరించింది.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రెస్‌మీట్‌లో శ్రీకాంత్ మాట్లాడుతూ.. తన కెరీర్‌కు ఇతోదికంగా జర్నలిస్టులు తోడ్పడ్డారని గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా రాజకీయ ప్రవేశం చేస్తారా? చిరంజీవి పార్టీలో చేరుతారా? అనే ప్రశ్నలకు శ్రీకాంత్ సమాధానమిస్తూ.. తనకు రాజకీయాలంటే పడవని సమాధానమిచ్చారు.

అంతేకాదు.. ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన మెగాస్టార్ చిరంజీవికి అభిమానిగా, మంచి స్నేహితుడిగా భావిస్తానని స్పష్టం చేశారు. అయితే తాను చిరంజీవి పార్టీకి ఎటువంటి ప్రచారం చేయలేదని, అన్నయ్య పార్టీ పెట్టినప్పుడు కూడా అందులో చేరాలనే ఆలోచనకూడా రాలేదని శ్రీకాంత్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌కు లక్షరూపాయల చెక్‌ను శ్రీకాంత్ అందజేశారు.
About Writer
SELVI.M