1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Magadheera

Ramcharan Teja| Magadheera| Genelia| Kajal Agarwal| Bommarillu Bhaskar| NagaBabu | జెనీలియా, కాజల్‌లతో "మగధీర" మూడో సినిమా!

ఈ సినిమా పేరు "ఆరంజ్" కాదు: నాగేంద్రబాబు

రామ్చరణ్ తేజ
WD
ప్రముఖ నిర్మాణ సంస్థ అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై "చిరుత"నయుడు, 'మగధీర' హీరో, రామ్ చరణ్ తేజ కథానాయకుడుగా, బొమ్మరిల్లు ఫేమ్ జెనీలియా, సెక్సీడాళ్ కాజల్ అగర్వాల్ నాయికలుగా నటించనున్న భారీ బడ్జెట్ మూవీ బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది.

హైటెక్ సిటీలోని హోటల్‌లో దేవుని పటాలపై ప్రారంభమైన తొలిషాట్‌కు దర్శకరత్న డాక్టర్. దాసరి నారాయణరావు క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామ్‌చరణ్ తొలిసినిమా "చిరుత" ఒక విజయమైతే.., అతని రెండో సినిమా "మగధీర" సెన్సేషనల్ రికార్డు సృష్టించిందన్నారు. అలాగే రామ్‌చరణ్ మూడో సినిమా కూడా ఘనవిజయం సాధించి హ్యాట్రిక్ సాధించాలని దాసరి ఆకాంక్షించారు.

మగధీరను రాజమౌళి మెస్మరైజ్ చేస్తే.. ఆ సినిమాతో రామ్‌చరణ్ తేజ చారిత్రాత్మక హీరోగా ఎదిగాడని దాసరి కితాబిచ్చారు. ఇకపోతే.. "మగధీర" నిర్మాత అల్లు అరవింద్ ఏ చిత్రానికి భారీగా ఖర్చు పెట్టరని, అయితే మగధీర సినిమా కోసం భారీగా ఖర్చు పెట్టారని చెప్పారు. కానీ షూటింగ్‌కు వస్తే.. అవుతున్న ఖర్చుకు జడుస్తానేమోనని భావించి.., ఎక్కడో ఉంటూనే భారీగా ఖర్చు పెట్టారని దర్శకరత్న చమత్కరించారు.
WD


అలాగే "బొమ్మరిల్లు" దర్శకుడు భాస్కర్‌కు, రామ్‌చరణ్‌తో తీసే ఈ మూడో సినిమా ఒక ఛాలెంజ్ అని, దర్శకుడికి, రామ్ చరణ్‌కి మరియు యూనిట్ సభ్యులందరికీ దాసరి ఈ సందర్భంగా ఆల్ ది బెస్ట్ చెప్పారు.

నిర్మాత నాగబాబు మాట్లాడుతూ.. రామ్‌చరణ్ కోరిక మేరకే బొమ్మరిల్లు దర్శకుడు భాస్కర్‌ను ఈ చిత్రానికి డైరక్టర్‌గా ఎంపిక చేశామని తెలిపారు. "మగధీర" చేస్తున్నప్పుడే రామ్‌చరణ్‌కు అది హిట్ అవుతుందని తెలుసు. అయితే మూడో సినిమా తీసే క్రమంలో రామ్‌చరణ్ కాస్త టెన్షన్‌కు గురయ్యాడని, మూడో సినిమాతో వర్సలైట్ హీరోగా ఎదగడమే చరణ్ కోరిక అని నాగబాబు చెప్పారు.

చరణ్ కాంబినేషన్‌లో రొమాంటిక్ లవ్‌స్టోరీగా, సెంటిమెంట్, మానవతావిలువల సమ్మేళనంతో బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రాన్ని అద్భుతంగా రూపొందించనున్నారని నాగేంద్రబాబు అన్నారు.
WD


రామ్‌చరణ్‌కు మూడో సినిమా తీయడం కాస్త భయంగానే ఉన్నా.. దర్శకుడు భాస్కర్ ధైర్యంగా తీస్తానని ముందుకొచ్చాడని నాగబాబు తెలిపారు. అలాంటి ఛాలెంజింగ్ దర్శకుడైన భాస్కర్.. చరణ్ మూడో సినిమాకు దర్శకుడు కావడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.

ఇకపోతే.. హైదరాబాదులో ఈ సినిమా తొలిషెడ్యూల్ జరుగుతుందని, డిసెంబరులో సినిమా కొంతభాగాన్ని ఆస్ట్రేలియాలో చిత్రీకరిస్తామని నిర్మాత నాగబాబు వెల్లడించారు. ఇంకా సినిమాకు "ఆరంజ్" అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు వస్తోన్న వార్తల్లో నిజంలేదని, ఈ చిత్రానికి "ఆరంజ్" అనేది టైటిల్ కాదని నిర్మాత స్పష్టం చేశారు. మంచి టైటిల్‌ వస్తే తెలియజేస్తామని నాగబాబు అన్నారు.

తమిళంలో కూడా ఈ సినిమాను విడుదల చేస్తారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు నాగబాబు సమాధానమిస్తూ.. తెలుగు, తమిళంలో రామ్‌చరణ్ తేజ మూడో చిత్రాన్ని విడుదల చేసే దిశగా ఆలోచిస్తున్నామని చెప్పారు.

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. అంజనా ప్రొడక్షన్స్‌పై రూపుదిద్దుకుంటోన్న ఏడవ సినిమా ఇదన్నారు. అలాగే బొమ్మరిల్లు భాస్కర్, మగధీర రామ్‌చరణ్‌లకు మూడో సినిమా ఇదని తెలిపారు. రామ్‌చరణ్‌ మగధీరను మరిచిపోయేటట్లు ఈ చిత్రాన్ని రూపొందిస్తానని భాస్కర్ హామీ ఇచ్చారని అల్లు అరవింద్ అన్నారు. మొత్తానికి ఈ సినిమా అటు దర్శకుడికి, ఇటు రామ్‌చరణ్‌కు హిట్ చిత్రంగా నిలిచిపోవాలని ఆశించారు.

హీరో రామ్‌చరణ్ మాట్లాడుతూ.. "మగధీర" విడుదలైన 40 రోజుల తర్వాత బాబాయ్‌తో మాట్లాడాను. ఆయనతోనే సన్నిహితంగా ఉంటాను. అలాగే మూడో సినిమా తీసే విషయంలో కాస్త టెన్షన్ పడ్డాను. ఆ సమయంలో బొమ్మరిల్లు భాస్కరి మదిలో మెదిలారు. వెంటనే ఈ విషయాన్ని బాబాయ్‌కి చెబితే ఆయన ఓకే చెప్పారని" చరణ్ వెల్లడించారు. రొమాంటిక్, ఎంటర్‌టైనర్‌గా భాస్కర్‌తో చేసే ఈ సినిమా తనకు ఓ ఛాలెంజ్‌ అని రామ్ చరణ్ చెప్పారు.

దర్శకుడు భాస్కర్ మాట్లాడుతూ.. మగధీర చూశాక అందరూ టెన్షన్‌కు గురయ్యారని, కానీ తనకు మాత్రం ఆ సినిమా చూసిన తర్వాత ఎలాంటి టెన్షన్ కలగలేదని చెప్పారు. మగధీర చూశాకే చరణ్‌తో మూడో సినిమా తీసేందుకు సిద్ధమయ్యానని, కథతో పాటు మంచి టీమ్ అన్ని తనకు సానుకూలంగా ఉన్నాయని తెలిపారు. తనతో పాటు రామ్‌చరణ్ తేజ కూడా హ్యాట్రిక్ సృష్టించే రీతిలో "డబుల్ హ్యాట్రిక్"కు ప్రయత్నిస్తానని భాస్కర్ హామీ ఇచ్చారు.
About Writer
SELVI.M