అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై మగధీర హీరో రామ్‌చరణ్ తేజ నటిస్తోన్న మూడో చిత్రం ప్రారంభోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. హైటెక్స్‌లోని నోవోటెల్ హోటల్‌లో ఆహ్లాదకరంగా సాగిన ఈ కార్యక్రమానికి పలువురు సినీప్రముఖులు హాజరయ్యారు.
రామ్‌చరణ్ కొత్త చిత్రం ప్రారంభోత్సవానికి దర్శకరత్న డాక్టర్. దాసరి నారాయణరావు ప్రధాన ఆకర్షణ. మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్ళాక దాసరి-చిరంజీవిల మధ్య కాస్త వ్యత్యాసం కనబడింది. ఏది ఏమైనా అది ఈ ప్రారంభోత్సవం రోజు కూడా కొట్టివచ్చినట్లు కన్పించింది.
దాసరి చిరుల మౌనం: ప్రారంభోత్సవానికి రాగానే నాగబాబు, చిరంజీని అందరికీ ఆహ్వానం పలికారు. కానీ దాసరి నారయణరావు, చిరుల మధ్య ఎలాంటి మాటల్లేకుండా చిరునవ్వు, కనుసైగలతో ఫంక్షన్ గడించింది. ముందుగా దేవుని పటాలపై పూజారులు పూజచేస్తుండగా.. దాసరి, చిరు ఇద్దరు కింద కుర్చీలో కూర్చున్నారు. వారిద్దరి మధ్య కనీసం మాటలు కూడా లేకపోవడం గమనార్హం. పై ఫోటోలో వారిద్దరూ స్టేజీ కింద కూర్చుని ఉండటం గమనించవచ్చు.
కనుసైగతో పదండి ముందుకు..!:
WD
ఆ తర్వాత చిరు తన సైగలతోనే, చేతులు ముందుకు సాచుతూ.. దేవుని పటాలపై చూపించి దీపారాధన చేయమని సంజ్ఞ చేశారు. అంతకుముందు నాగబాబు దాసరిని ఆహ్వానించారు. తదనంతరం చిరుకూడా స్టేజ్‌పైకి ఎక్కి జ్యోతి ప్రజల్వనలో పాల్గొన్నారు.
ఫోటోగ్రాఫర్లందరూ.. డైరక్టర్లు అయిపోయారా? జ్యోతిప్రజల్వనకు అనంతరం ప్రారంభోత్సవానికి హాజరైన దర్శకులంతా నిలబడి గ్రూప్ ఫోటోకు దిగారు. కోడి రామకృష్ణ, కె. రాఘవేంద్రరావు, భాస్కర్, శ్రీనువైట్ల, సురేందర్ రెడ్డి, రాజమౌళి తదితరులతో దాసరి నిలబడి చిత్ర హీరో గురించి, చిత్రం గురించి ఆశీస్సులందించారు.
WD
ఆ తర్వాత ఫోటోగ్రాఫర్లు.. డైరక్టర్లు అయిపోయారా? మాకు హీరోల ఫోటోలు కావాలనే ఉద్దేశంతో అడిగారు. వెంటనే దాసరి స్పందిస్తూ.. డైరక్టర్లు అవ్వరా! హీరోలు అయిపోతారు. కొత్తవారు వస్తారంటూ ముక్తాయింపు ఇచ్చారు. దీంతో దర్శకులంతా ఒక్కసారిగా గర్వంగా నవ్వుకున్నారు. ఇంతకి హీరోలు అని ఎవరిని అన్నారో తెలియదు కానీ.. ఆ డైలాగ్ కాస్త పేలింది. ఆ తర్వాత ఫోటోగ్రాఫర్లు.. రామ్‌చరణ్, చిరంజీవి, అల్లు అర్జున్, నాగబాబులతో కలిసి ఓ ఫోటో తీశారు.
పూరీ జగన్నాథ్ జంప్! దర్శకులంతా కలిసి ఆశీస్సులు, శుభాకాంక్షలు తెలియజెప్పే సమయానికి ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ లేకపోవడంతో.. అల్లు అరవింద్ మైక్‌లో చాలాసేపు పిలిచారు. ఈలోగా ఆయన జంప్ అయినట్లు అక్కడివారు చెప్పడంతో.. ఓకే.. పూరీ వేరే ఫంక్షన్‌కు హాజరుకావాలని వెళ్ళారని సమర్థించుకున్నారు.
WD
నో.. నో.. ఏమీ మాట్లాడను: చిరంజీవి తన తనయుడు రామ్‌చరణ్ తేజ మగధీర బిగ్ సక్సెస్‌కు అనంతరం మూడో చిత్రం లాంఛనంగా ప్రారంభమైన ఈ రోజున (బుధవారం) మెగాస్టార్ చిరంజీవి ఎవరితోనూ పెద్దగా మాట్లాడలేదు. తన కుమారుడు గురించి కాస్త మాట్లాడుతారని అందరూ ఆశించి ఆయన్ను అడిగారు. కానీ చిరు అందరికి "నో.. నో.. నేను చెప్పేదేమీలేదని.." కుడిచేత్తో సైగచేస్తూనే బయటకు వచ్చేశారు... ఇలా రామ్‌చరణ్ మూడో సినిమా ప్రారంభోత్సవంలో కొన్ని ఆసక్తికరమైన అంశాలు చోటుచేసుకున్నాయి.