గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » కథనాలు » పాటల చిత్రీకరణలో తనీష్, మధురిమల "మౌనరాగం" (Mouna Ragam| Cinema Songs| Tanish| Madhurima| Suhasini| Hyderabad| Shooting)
కథనాలు
Feedback Print Bookmark and Share
 
Tanish, Madhirima
WD
తనీష్, మధురిమ, సుహాసిని జంటగా, శ్రీ సాయిదేవ ప్రొడక్షన్స్ పతాకంపై, శానం నాగ అశోక్‌కుమార్ నిర్మిస్తోన్న చిత్రం "మౌనరాగం". ఈ చిత్రంలోని ఓ పాటను హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరిస్తున్నారు.

"ఎందాక ఎందాక నీ వేగం ఎందాక.." అనే పాటను శోబి నృత్యదర్శకత్వంలో తనీష్, మధురిమ, కొంతమంది డాన్సర్లపై ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. రెండు రోజుల్లో ఈ పాట పూర్తవుతుందని, ఈ నెల 27తో షూటింగ్ కార్యక్రమాలు పూర్తవుతాయని నిర్మాత చెప్పారు. చక్కని లవ్ ఫీల్‌వున్న కథ ఇదని, "వసంతం" తరహాలో ఈ సినిమా ఉంటుందన్నారు.

చిత్రదర్శకుడు విజయ్ బాలాజీ మాట్లాడుతూ.. హృదయ స్పందన ఎలా ఉంటుందనేది ఈ చిత్రంలో చూపించాం. ప్రేమించిన జంట యొక్క స్పందన మనస్సులో ఉండిపోతే అదే మౌనరాగమని బాలాజీ అన్నారు. టైటిల్ పాతదైనా కథ కొత్తగా ఉంటుందని చెప్పారు. ఈ చిత్రంలో రెండు విశేషాలున్నాయి. తమిళ చిత్రం "పసంగ"లో నటించిన కిషోర్ ఈ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుగా నటిస్తున్నాడని, పది సంవత్సరాల అశ్విత్ అనే కుర్రాడు ఓ పాట పాడాడని దర్శకుడు వెల్లడించారు.

ఇంకా ఈ చిత్రానికి కెమెరా: షమన్ మిత్రు, సంగీతం: ఎస్.ఎ. రాజ్‌కుమార్.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: మౌనరాగం, సినిమా, పాటలు, తనీష్, మధురిమ, సుహాసిని, హైదరాబాద్, షూటింగ్