Rakshakulu| Break of the rules| Songs| Shootings| Prerana| Uday| Niharika | పాటల చిత్రీకరణలో "రక్షకులు"
WD
ఈ సందర్భంగా దర్శకులు మాట్లాడుతూ.. రెండు రోజుల నుంచి దిలీప్ మాస్టర్ కొరియోగ్రఫీలో 30మంది డ్యాన్సర్లపై "సోకు బాగుంది.." అనే పాటను చిత్రీకరించడం జరుగుతుందన్నారు. మిగిలిన పాటలను కూడా ఏకధాటిగా చిత్రీకరించనున్నామని దర్శకుడు చెప్పారు. సమాజాన్ని ఆలోచింప జేసే విధంగా 'రక్షకులు' (బ్రేక్ ద రూల్స్) కథ ఉంటుందని తెలిపారు.
కొరియోగ్రాఫర్ దిలీప్‌మాస్టర్ మాట్లాడుతూ.. ఈ పాటలకు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అద్భుతంగా తెరకెక్కించేందుకు నిర్మాత, దర్శకులు ఎంతగానో తోడ్పడ్డారని చెప్పారు.
సత్యప్రకాష్, రాంరెడ్డి, కొండవలస, జెమిని రాఘవ, వెంకట్ భగవాన్, కాదల్ దండపాణి, షకీల, జమ, మార్తరవి తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సమర్పణ: వెంకట్ భగవాన్, సంగీతం: శ్రీ వరంగల్ శ్రీనివాస్, ఫోటోగ్రఫీ: కళ్యాణ్ సమీ, ఎడిటర్: సత్యం, మాటలు: రెడ్డి, ఆర్ట్ విజయకృష్ణ.