Shilpa Shetty| Raj Kundra| Engagement| Mumbai| Pink chiffon saree | 24న శిల్పాశెట్టి-రాజ్ కుంద్రాల నిశ్చితార్థం!
WD
ఈ నిశ్చితార్థ వేడుకలో రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి అతి ఖరీదైన దుస్తులను ధరించనున్నారని సన్నిహితులు చెప్పారు. అలాగే ప్రముఖ ఆభరణాల సంస్థ బంద్రా స్టోర్స్ శిల్పాశెట్టి నిశ్చితార్థ నగలను డిజైన్ చేసిందని తెలిసింది. ఈ నగలతో శిల్పాశెట్టి ఇంకా అందంగా కనిపిస్తారని, ఆమె వివాహ ఆభరణాలను డిజైన్ చేసే అవకాశం కూడా తమకే లభించవచ్చునని బంద్రా స్టోర్స్ వర్గాలు తెలిపాయి.
శిల్పాశెట్టి నిశ్చితార్థంపై ఆమె సోదరి షమీతా మాట్లాడుతూ.. శిల్పా నిశ్చితార్థం ఉన్నట్టుండి నిర్వహించాల్సి వచ్చిందని, రాజ్‌కుంద్రా దీపావళికి శిల్పాకు రింగ్ బహుమతిగా ఇచ్చారని చెప్పింది. రెండు రోజుల ముందు రాజ్ తమ నిశ్చితార్థం విషయమై శిల్పాతో మాట్లాడారని, దీనికి మా తల్లిదండ్రులు అంగీకరించారని వెల్లడించింది.
2010లో శిల్పాశెట్టి-రాజ్ కుంద్రాల వివాహం ఉంటుందని షమీతా తెలిపింది. శిల్పాశెట్టి నిశ్చితార్థ చీరను మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారని.. ఇది లేత గులాబీ రంగులో, చక్కటి బార్డర్ కలిగి ఉంటుందని ఆమె చెప్పింది. ఇంకా.. పసిడి రంగు బ్లౌజ్, అదిరే ఆభరణాలతో శిల్పాశెట్టి ఎంతో అందంగా కన్పిస్తుందని ఆమె తెలిపింది.
వైభవంగా జరుగనున్న శిల్పాశెట్టి-రాజ్ కుంద్రా నిశ్చితార్థ ఆహ్వాన లేఖలు కొందరు సినీ ప్రముఖులకు పంపిణీ చేయడం జరిగింది. మాజీ ప్రపంచ సుందరిగా ప్రపంచ సెలబ్రెటీగా, నటీమణిగా పేరు తెచ్చుకున్న శిల్పాశెట్టి నిశ్చితార్థం సన్నిహితులు, స్నేహితులు, కొందరు సినీ ప్రముఖుల సమక్షంలో జరుగనుంది.