1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Cinema

Cheta venna mudda| Cinema| Krishnudu| Happy Days| Krithika Krishnan| Altaf| Songs|Shooting | పాటల చిత్రీకరణలో "చేత వెన్నముద్ద"

చేతవెన్నముద్ద
WD
ఆల్తాఫ్, హ్యాపీడేస్ ఫేమ్ క్రితిక, కృష్ణన్ హీరోహీరోయిన్లుగా రోహిత్. ఎస్. అభ్యుదయ్ దర్శకత్వంలో ఫుల్‌మూన్ పిక్చర్స్ పతాకంపై పి.ఆర్. కుమార్ నిర్మిస్తోన్న చిత్రం "చేతవెన్నముద్ద". ప్రస్తుతం ఈ సినిమా పాటల చిత్రీకరణలో ఉంది.

ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఎమ్. భరత్ కుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం, హీరో, హీరోయిన్లతో పాటు పలువురు విదేశీ అమ్మాయిలపై "అందాలపూదోట తోటలో ఒక మేడ.. మేడలో చెలిబాల.." అనే పాట చిత్రీకరణ జరుగుతోంది. ఇదే షెడ్యూల్‌లో మరో పాటను కూడా చిత్రీకరిస్తాం. దీంతో పాటల చిత్రీకరణ పూర్తవుతుందని నిర్మాత వెల్లడించారు.

ఇంకా 30 శాతం టాకీ మాత్రమే మిగిలి ఉంటుందని, సంగీత దర్శకుడు రవిస్వరూపన్, లావణ్య ద్వయం అందించిన బాణీలు అద్భుతంగా వచ్చాయని ఎమ్. భరత్ కుమార్ అన్నారు. ఇద్దరు గాఢ ప్రేమికుల మధ్య ఏర్పడ్డ శూన్యతను కాలం ఎలా పరిష్కరించింది అనేదే చిత్ర కథాంశం అని తెలిపారు.

సహ నిర్మాత పామరాజు జానకిరామ్ మాట్లాడుతూ.. తెలుగులో తొలిసారిగా మెర్సీకిల్లింగ్‌పై నిర్మిస్తున్న చిత్రమిదని, హీరో ఆల్తాఫ్, హ్యాపీడేస్ క్రితిక క్రిష్ణన్‌లపై చిత్రీకరించిన ప్రేమ సన్నివేశాలు.. ప్రేమికుల్లో కొత్త అనుభూతిని కలిగిస్తాయి. మెర్సీకిల్లింగ్‌పై రూపొందుతోన్న ఈ ప్రేమకథా చిత్రాన్ని ప్రేమికులు తప్పకుండా చూసేలా ఉంటుంది. పాటలను నెలాఖరున విడుదలచేసి, సినిమాను వచ్చే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.

సమర్పకుడు బెల్లంకొండ రఘు మాట్లాడుతూ.. మెర్సీకిల్లింగ్‌ అనే కొత్త కాన్సెప్ట్‌ను తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకముందని చెప్పారు.

శిల్పాజాగృతి, కృష్ణుడు, అన్నాజెన్, మెటిల్డా, మైక్, శశి, హరికృష్ణ, నీరజ పాండే, కృష్ణవేణి శతగోపన్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: రవిస్వరూపన్-లావణ్య, కెమెరా: రవి.కె.నీర్ల, పాటలు: రవిస్వరూపన్, ఇమంది రామారావు, కథ: వి.ఎన్. సతీష్, మాటలు: మోహన్ తుమ్మల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: ఎమ్. భరత్‌కుమార్, సి.ఎస్. కుమార్, స్క్రీన్‌ప్లే, సహనిర్మాత: పామరాజు జానకిరామ్, నిర్మాణ నిర్వహణ: శ్రీకాంత్ వడ్ల, నిర్మాత: పి.ఆర్.కుమార్, దర్శకత్వం: రోహిత్. ఎస్. అభ్యుదయ్.
About Writer
SELVI.M