1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Magadheera

Allu Aravind | Magadheera | Cinema | Flood | Collections | RamCharan | మానవత్వం ఉన్న మనుషుల్లారా.. "మగధీర" చూడండి!

మగధీర
File
FILE
ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని తలంపు, మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ "మగధీర" చిత్రాన్ని చూడాలని ఆ చిత్ర నిర్మాత అల్లు అరవింద్ విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తి వెనుక తన చిత్ర కలెక్షన్లను మరింతగా పెంచుకోవాలన్న కుట్ర ఉందని భావించవద్దు. ఇటీవల రాష్ట్రంలో సంభవించిన భారీ వరదల వల్ల ఐదు జిల్లాల్లో అపార నష్టం వాటిల్లిన విషయం తెల్సిందే.

సర్వం కోల్పోయిన కట్టుబట్టలతో మిగిలిన బాధితులను ఆదుకునేందుకు గాను అరవింద్ ముందుకు వచ్చారు. తమ వంతు సాయం చేయాలని ఆయన తలచారు. ఇందుకోసం 'మగధీర' చిత్రానికి ఆదివారం (25వ తేదీ) వసూలయ్యే మొత్తం కలెక్షన్లను వరద బాధిత సహాయ నిధికి అందజేయాలని నిర్ణయించారు.

అందువల్ల ఆదివారం ఈ చిత్రాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరూ చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఈ చిత్రం విడుదలైన 85 రోజుల్లో దాదాపు 75 కోట్ల రూపాయలను వసూలు చేసినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. చిత్రం విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు రికార్డులపై రికార్డులు నెలకొల్పుతోంది.

రాష్ట్ర వ్యాప్తంగా కాసుల వర్షం కురిపిస్తూ.. ఇప్పటికీ అన్ని సెంటర్లలో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో వరద బాధితులకు తన వంతు సాయం చేసే ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని ఆదివారం చూస్తే.. ఆ రోజు వసూలయ్యే కలెక్షన్స్ మొత్తాన్ని బాధితులకు అందజేస్తామని అల్లు అరవింద్ ప్రకటించారు.
About Writer
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి